లాక్​డౌన్​ ఎఫెక్ట్: పంజాబీ యాక్టర్ మన్మీత్ సూసైడ్

లాక్​డౌన్​ ఎఫెక్ట్: పంజాబీ యాక్టర్ మన్మీత్ సూసైడ్

ముంబై: కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలను కుదిపేస్తోంది. సినిమా ఇండస్ట్రీలోనూ చాలా మంది ఉపాధి కోల్పోయారు. టీవీ సీరియల్స్ షూటింగ్స్ లేక ఆర్టిస్టులకు ఉపాధి కరువైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పంజాబీ యాక్టర్ మన్మీత్ గ్రెవాల్(32) ఆదివారం సూసైడ్ చేసుకున్నాడు. ‘‘ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గ్రెవాల్ లాక్​డౌన్ ఎఫెక్టుతో షూటింగ్స్ ఆగిపోయి మరింత మానసిక ఒత్తిడులకు లోనయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పులు చెల్లించలేక మానసిక ఒత్తిడితోనే ఉరివేసుకుని చనిపోయాడు” అని గ్రెవాల్ ఫ్రెండ్, నిర్మాత మంజిత్ సింగ్ రాజ్ పుత్ మీడియాకు తెలిపారు. పంజాబ్ కు చెందిన మన్మీత్ బార్యతో కలిసి ముంబైలో నివసించాడు. దత్ సే మజ్బూర్, కుల్దీపాక్ వంటి సీరియల్స్ లో నటించాడు. టీవీ షోలు, యాడ్స్ లలో నటించాడు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.