
టీవీఎస్ మోటార్ అపాచీ ఆర్టీఆర్ 310ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎక్స్ షోరూం ధర రూ.2.43 లక్షలు. ఇందులోని 312.2 సీసీ లిక్విడ్- కూల్డ్, సింగిల్- సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 35 బీహెచ్పీ పవర్ అవుట్‌పుట్‌ను, 28.7 ఎన్ఎం గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది.
0--–60 కిలోమీటర్ల వేగాన్ని 2.81 సెకన్లలో అందుకుంటుంది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310లో నకిల్ గార్డ్, వైజర్, టాప్ బాక్స్ కిట్, 14 సేఫ్టీ గేర్స్, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి ఆకర్షణలు ఉన్నాయి.