
హైదరాబాద్ : టీవీఎస్ మోటార్ కంపెనీ అపాచీ ఆర్‌ఆర్ 310 బైకును బుధవారం హైదరాబాద్‌లో లాంచ్ చేసింది. ‘రేస్ ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్’ టెక్నాలజీతో ఈ బైక్‌ను రూపొందించింది. రైడింగ్ హై స్పీడులో ఉన్నప్పుడు కార్నర్స్‌లో, డౌన్‌సిఫ్ట్స్‌లో వెహికిల్‌లో స్థిరత్వం పొందవచ్చు. ఫాంటమ్ బ్లాక్ రంగులో ఈ బైక్‌ను లాంచ్ చేసింది టీవీఎస్. దీని ధర ఎక్స్‌షోరూం హైదరాబాద్‌లో రూ.2,20,200గా ఉంది. ఎంపిక చేసిన డీలర్‌షిప్స్ వద్ద ఈ బైక్ దొరుకుతుంది.