
మహాత్మా గాంధీపై వివాదాస్పద ట్వీట్‌చేసిన ఐఏఎస్ఆఫీసర్ నిధి చౌధరిని మహారాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్చేసింది. ముంబై మున్సిపల్కార్పొరేషన్నుంచి మంత్రాలయ వాటర్సప్లై డిపార్ట్మెంట్కు ఆమెను బదిలీ చేసింది. ట్వీట్‌పై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గాంధీ విగ్రహాలను తొలగించాలని, కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మను తీసేయాలని నిధి చౌధరి ట్వీట్‌చేశారు. గాంధీని హత్య చేసిన నాథూరామ్గాడ్సేకు ధన్యవాదాలంటూ ట్వీట్లో పేర్కొన్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తంకావడంతో నిధి మాటమార్చారు. తన ట్వీట్‌కు తప్పుడు అర్థాలు ఆపాదించారని వివరణ ఇచ్చారు.