ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాను వణికిస్తుంది హ్యకింగ్. రోజు రోజుకు రెచ్చిపోతున్న హ్యాకర్లు లేటెస్ట్ గా ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ అకౌంట్ నే హ్యాక్ చేశారు. ఆగస్టు 30న 15 నిముషాల పాటు గుర్తు తెలియని వ్యక్తులు డోర్సీ అకౌంట్ ను హ్యాక్ చేశారు అంతేగాకుండా ట్విట్టర్లో హ్యాకర్లు జాతిని రెచ్చొట్టే విధంగా, నల్లజాతీయులపై విద్వేష వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. వెంటనే అప్రమత్తమైన నిపుణులు హ్యాకర్ల నుంచి రక్షించి వారు పెట్టిన పోస్ట్ లను తొలగించారు. సిస్టమ్ లో లోపం ఏం లేదని ట్విట్టర్ ప్రకటించింది.
ట్విట్టర్ కు లింక్ చేసిన ఫోన్ నెంబర్ వేరే వాళ్లు వాడటం వల్లే అకౌంట్ హ్యాక్ అయిందని తెలిపింది. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ పొరపాటే దీనికి కారణమని తెలిపింది. ట్విట్టర్లో లింక్ చేసిన మొబైల్ నంబర్ నుంచి టెక్స్ట్ చేసి మెసేజ్ పోస్ట్ చేసే ఫీచర్ ఉంది. హ్యాక్టర్లు కూడా సేమ్ నంబర్ తో వేరే సిమ్ కార్డు తీసుకుని మెసేజ్ చేయొచ్చని భావిస్తున్నారు.
