
- బిలియన్ డాలర్లు ఇస్తున్నట్లు వెల్లడి
- ఆదాయంలో 28 శాతం
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ట్విట్టర్ సీఈవో డోర్సీ భారీ విరాళం ప్రకటించారు. కరోనాను ఎదుర్కునేందుకు బిలియన్ డాలర్లను ఇస్తున్నట్లు ఆయన పర్సనల్ ట్విట్టర్ ద్వారా చెప్పారు. తన ఆన్ లైన్ సంస్థ స్కేర్ ద్వారా మొత్తం సంపదలో 28 శాతం ఆర్థిక సాయంగా ఇస్తున్నట్లు చెప్పారు. స్టార్ట్ స్మాల్ కు అందిన డబ్బు ఏ సేవా సంస్థలకు ఎంత మొత్తంలో అందుతుందో తెలిసే విధంగా ఒక లింక్ ను కూడా పోస్ట్ చేశారు. స్క్వేర్ లో ఎక్కువ వాటా ఉన్నందున ట్విట్టర్ నుంచి కాకుండా స్క్వేర్ నుంచి ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచానికి సాయం చేయాల్సిన అవసరం చాలా ఉందని, సామాజానికి సేవ చేసేందుకు ఏ చాన్స్ వచ్చినా ఉపయోగించుకోవాలని అన్నారు. కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడిన తర్వాత బాలికల ఆరోగ్యం, విద్యపై దృష్టి పెడతానని చెప్పారు.