ఇండియాలో కష్టాల్లో పడ్డ ట్విట్టర్

ఇండియాలో కష్టాల్లో పడ్డ ట్విట్టర్

ట్విట్టర్, కేంద్రానికి మధ్య వార్ పీక్స్ కు చేరింది. భారత్ లో చట్టపరమైన రక్షణను ట్విట్టర్ కోల్పోయింది. కొత్త ఐటీ నిబంధనలు అమలు చేయనందుకు ఇండియాలో ట్విట్టర్ మధ్యవర్తి  హోదాను కోల్పోయింది. దీంతో యూజర్ల అభ్యంతకర పోస్టులకు ట్విట్టర్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.  అయితే తాము కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని ట్విట్టర్ ఓ ప్రకటన విడుదల చేసింది.

మే 25 నుంచి కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.  కొత్త ఐటీ నిబంధనలు అమలు చేయడం లేదంటూ కొంతకాలంగా ట్విట్టర్ ను హెచ్చరిస్తూ వస్తోంది కేంద్రం. నిబంధనలు అములు చేయకపోతే మధ్యవర్తిత్వాన్ని కోల్పోవడంతో పాటు...ట్విట్టర్ లో వచ్చే ప్రతి మెసేజ్ కు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతోంది. మధ్యవర్తిత్వం కోల్పోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటాయని హెచ్చరిస్తూ వస్తోంది.

మొదటిసారిగా నిన్న ట్విట్టర్ పై FIR నమోదైంది. యూపీలో జరిగిన ఓ గొడవకు సంబంధించిన విషయంలో ట్విట్టర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ట్విట్టర్ తో పాటు కొంత మంది జర్నలిస్టులను కలుపుకుని మొత్తం 9 మందిపై కేసు బుక్ చేశారు.