Elon Musk: వేలంలో ట్విట్టర్ అకౌంట్స్ సేల్

Elon Musk: వేలంలో ట్విట్టర్ అకౌంట్స్ సేల్

ట్విట్టర్ విషయంలో తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాల వల్ల ఎలన్ మస్క్ జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు.  యాడ్స్ రెవెన్యూ తగ్గిపోవడంతో ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచుకునే పనిలో పడ్డాడు. అందుకే ఉద్యోగుల్ని కంపెనీ నుంచి తొలగిస్తూ, పాత కంప్యూటర్లు, టేబుల్స్ అమ్ముతూ ఆఫీసుల్ని మూసేస్తున్నాడు. ట్విట్టర్ బ్లూ, బ్లూ టిక్ సబ్స్ స్క్రిప్షన్ ని తీసుకొచ్చి నెలవారి సబ్స్ స్క్రిప్షన్ ప్లాన్ లను అమలుచేశాడు. వాటితో పాటు ఇప్పుడు మస్క్ ట్విట్టర్ అకౌంట్లను వేలానికి పెట్టనున్నాడు.  

ఈ వేలంలో చాలా సంవత్సరాలుగా ఎలాంటి ట్వీట్స్, లాగిన్ చేయకుండా ఉన్న యూజర్ అకౌంట్లను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈ వేలం ద్వారా యూజర్లు వాళ్లకు నచ్చిన పేరున్న అకౌంట్ ను కొనుగోలు చేసుకోవచ్చు. ఇప్పటివరకు 150  కోట్ల ట్విట్టర్ ఖాతాలు ఖాళీగా ఉండగా వాటిని విక్రయించే పనిలో పడ్డాడు. అయితే ఒక ఖాతాను ఎంతకు విక్రయిస్తాడో మాత్రం తెలియదు.