దిగొచ్చిన ట్విట్టర్.. గ్రీవెన్స్ ఆఫీసర్‌ నియామకం

దిగొచ్చిన ట్విట్టర్.. గ్రీవెన్స్ ఆఫీసర్‌ నియామకం

న్యూఢిల్లీ: కొత్త ఐటీ నిబంధనల విషయంలో ఇన్నాళ్లూ ససేమిరా అన్న సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్ర రూల్స్ అమలు దిశగా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో భారత్‌లో రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ (ఆర్‌జీవో)ను తాజాగా నియమించింది. మన దేశానికే చెందిన వినయ్ ప్రకాశ్‌కు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సంస్థ వెబ్‌సైట్‌లో ఆయన వివరాలను ఉంచిన ట్విట్టర్.. వినియోగదారులు తమ ఫిర్యాదులను అందులోని ఈమెయిల్ ఐడీకి పంపొచ్చని పేర్కొంది. 

గత నెలలో ట్విటర్‌ ఇండియా తాత్కాలిక రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారిని నియమించినా.. ఆయన రెండు వారాల్లోనే తన పదవికి రాజీనామా చేశారు. గ్రీవెన్స్ అధికారిగా నియమితులైన ధర్మేంద్ర చతుర్‌ జూన్ 16న బాధ్యతలు చేపట్టి జూన్ 28న తప్పుకున్నారు. జులై 11 లోగా తాత్కాలిక గ్రీవెన్స్ అధికారిని నిమమిస్తామని, రెండు వారాల్లోగా తాత్కాలిక నోడల్ కాంటాక్ట్ అధికారిని నియమిస్తామని ట్విట్టర్ కోర్టుకు తెలిపింది. ఎనిమిది వారాల్లోగా మూడు నియమాకాలు పూర్తిచేయనున్నట్టు పేర్కొంది. అయితే వారం రోజుల్లోనే ఆర్‌జీఓను నియమించింది.