ఇక నుంచి ట్విట్టర్ కూడా డబ్బులిస్తుంది.. మీ దగ్గర దమ్ముండాలి అంతే

ఇక నుంచి ట్విట్టర్ కూడా డబ్బులిస్తుంది.. మీ దగ్గర దమ్ముండాలి అంతే

గూగుల్, యూట్యూబ్, ఫేస్ బుక్ మాత్రమే కాదు.. ఇక నుంచి ట్విట్టర్ కూడా డబ్బులిస్తుంది. కంటెంట్ క్రియేటర్స్ కు ఈ ఆప్షన్ ఇవ్వటానికి రెడీ అవుతోంది. ట్విట్టర్ యాడ్ రెవెన్యూలో.. కొంత భాగాన్ని  క్రియేటర్లకు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.ప్రస్తుతం ట్విట్టర్ అంటే పెయిడ్.. మన డబ్బులు చెల్లించి టిక్ మార్కు తీసుకోవాలి. లేదంటే గుంపులో గోవింద. 

అయితే ఇప్పుడు దీనికి పోటీగా థ్రెడ్ ఎంట్రీ ఇవ్వటం.. వారం రోజుల్లోనే 10 కోట్ల మంది థ్రెడ్ ఫాలోవర్స్ గా మారటంతో.. ట్విట్టర్ వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ట్విట్టర్ ఖాతాదారులు థ్రెడ్ వైపు వెళ్లకుండా..  బంపరాఫర్ ప్రకటించనుంది. ఇక నుంచి ట్విట్టర్ కంటెంట్ క్రియేటర్లకు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని క్రియేటర్లకు చెల్లించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసింది. 

జులై 14 నుండి, స్పామ్ మెసేజ్‌ల సంఖ్యను తగ్గించడానికి కొత్త మెసేజ్ సెట్టింగ్ పరిచయం చేయనుంది. ఈ సెట్టింగ్ కింద, వినియోగదారులు అనుసరించే వ్యక్తుల నుండి సందేశాలు ప్రైమరీ ఇన్‌బాక్స్‌లో కనిపిస్తాయి.