పాక్ మంత్రికి కౌంటర్లు: దమ్ముంటే భారత్ కన్నా ముందు రాకెట్ పంపండి

పాక్ మంత్రికి కౌంటర్లు: దమ్ముంటే భారత్ కన్నా ముందు రాకెట్ పంపండి

చంద్రయాన్-2 పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ సైన్స్ మంత్రి ఫవాద్ చౌదరీ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సరదా ట్వీట్‌లతో ఫవాద్ కు చురకలు అంటిస్తున్నారు. శనివారం ఫవాద్… చంద్రయాన్2 గురించి ట్వీట్ చేస్తూ.. ఇండియా రాని పనిలో వేలు ఎందుకు పెట్టిందని అన్నారు. చంద్రయాన్ మూన్‌పై  కాకుండా ముంభైలో ల్యాండ్ అయిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీంతో ఫవాద్‌పై నెటిజన్లు సెటైర్లు వేశారు. ఇండియా ఆ మాత్రమైనా స్పేస్‌పై తన సత్తాచాటాలని చూస్తుంటే.. పాకిస్తాన్ కనీసం అటువైపు కూడా చూడటానికి ధైర్యం లేదని అన్నారు.

పాక్ మంత్రికి ఆ దేశ ప్రజల కౌంటర్…
పాక్ మంత్రి ఫవాద్‌కు అదే దేశానికి చెందిన పలువురు నెటిజన్లు కౌంటర్ ఇచ్చారు. మహమ్మద్ హజ్రాన్ అనే అతను ఫహాద్ కు రిప్లే ఇస్తూ…  భారత్ కనీసం మూన్ మిషన్ చంద్రయాన్ ను ప్రయోగించగలిగిందని… పాకిస్తాన్ అయితే అటువైపు చూడడానికి కూడా భయపడుతుందని అన్నారు. సైన్స్ మినిష్టర్ గా ఉన్న మీరు ఇప్పటి వరకు సైన్స్ ను దేశంలో ఎంత అభివృద్ది చేయడానికి కృషి చేశారో చెప్పాలని అన్నారు.

భారత్ కు నీతులు చెప్పే బదులు.. 
అల్తబ్ బట్ అనే పాకిస్తానీ… ఫవాద్ కు రిప్లే ఇస్తూ… మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిష్టర్… భారత్ కు నీతులు చెప్పే బదులు.. పాకిస్తాన్ మూన్ పైకి రాకెట్లను ఎప్పుడు పంపుతుంతో చెప్పండి.. మీకే గనుక గట్స్ ఉంటే.. భారత్ కంటే ముందు పాకిస్తాన్ కు చెందిన రాకెట్ కాలు మోపేలా చేయండని ట్వీట్ చేశారు.

పాకిస్తాన్ తయారు చేసిన రాకెట్ చంద్రుని మద్యనుంచి వెళ్లిపోయాందట…
పాకిస్తాన్ కూడా చంద్రుని పైకి రాకెట్ పంపించిందని అన్నాడు ఒక నెటిజన్. అయితే అప్పటికే పాక్ మంత్రి చంద్రున్ని రెండుగా చేయడంతో ఆ రెండు చంద్రుల మద్యనుంచి రాకెట్ అవతలి వైపుకు వెళ్లిపోయాయని చురకలు అంటించారు.

పాక్ రాకెట్‌లో మూన్ పైకి వెళ్తున్న ఫహాద్ చౌదరీ…
అమిత్ అనే నెటిజన్.. పాకిస్తాన్ కూడా మూన్‌పైకి వెళ్లడానికి రాకెట్ చేసిందని అయితే అందులో ఫవాద్ వెళ్తున్నాడని రెండు ఐరన్ మాడల్ రాకెట్లను ట్వీట్ చేశాడు.

పాకిస్తాన్‌కు రాకెట్ నాలెడ్జ్ లేదు…
పాకిస్తాన్ కు భారత్ కు ఇదే తేడా అని ఒ విదేశీ మహిళ పాక్ మంత్రి ఫవాద్ కు రిప్లే ఇచ్చింది. రాకెట్ మిషన్ ఫేయిల్ అయినంత మాత్రాన ఇస్రో ఓడిపోలేదని చెప్పింది. అసలు రాకెట్ సైన్స్ గురించి తెలువని పాకిస్తాన్ లాంటి దేశం కూడా ఇండియా తలపెట్టిన చంద్రయాన్ గురించి మాట్లాడటం ఏంటని ట్వీట్ చేసింది.