కరోనా ఎఫెక్ట్: ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చిన ప్రముఖ కంపెనీ

కరోనా ఎఫెక్ట్: ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చిన ప్రముఖ కంపెనీ

కరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే దాదాపు 20 దేశాలకు పైగా విస్తరించింది. బయటి దేశాల నుంచి ఎవరొచ్చినా వారికి పూర్తిగా పరీక్షలు నిర్వహించిన తర్వాతే వారిని ఇంటికి పంపిస్తున్నారు. కరోనా దెబ్బకు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఇంటి నుంచి వర్క్ చేయడానికి అనుమతులిస్తూ నోటీసు జారీ చేసింది.

‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులందరూ ఇంటి నుండి పనిచేస్తే.. అటువంటి వారందరినీ మేం ప్రోత్సహిస్తున్నాము. మా ఆఫీసులన్నీ తెరిచే ఉంటాయి. కచ్చితంగా ఆఫీసుకు రావాలనే రూల్ ఏం లేదు. వర్క్ ఫ్రం హోం అనేది మీ ఆప్షన్. మీరు ఇంటి నుంచి వర్క్ చేసినా మేం అంగీకరిస్తాం’ అని ట్విట్టర్ కంపెనీకి చెందిన ఉన్నతాధికారి జెన్నిఫర్ క్రిస్టీ తెలిపారు.

తమ ఉద్యోగుల రక్షణ కోసం డీప్ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది. దక్షిణ కొరియా, హాంకాంగ్, మరియు జపాన్ కార్యాలయాల్లో పనిచేసే తమ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తామని కోరినట్లు ట్విట్టర్ తెలిపింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులందరికీ ఈ అవకాశం కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా.. తమ కంపెనీకు చెందిన అన్ని విదేశీ పర్యటనలను నిలిపివేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది.

For More News..

జీహెచ్ఎంసీ లారీ కింద పడి.. జీహెచ్ఎంసీ ఉద్యోగి మృతి

అనుమానంతో నోట్లో విషం పోసి… నోటి చుట్టూ చున్నీ కట్టి..

సోషల్‌‌ మీడియాకు మోడీ గుడ్‌‌బై!