మస్క్ సంపదలో రోజుకు 2,500 కోట్లు ఆవిరి

మస్క్ సంపదలో రోజుకు 2,500 కోట్లు ఆవిరి

ట్విట్టర్ లో ఎదురవుతున్న పరినామాలవల్ల ట్విట్టర్ షేర్లు పడిపోతున్నాయి. ఇన్వెస్టర్లు, అడ్వర్టైజర్లు వెళ్లిపోతున్నారు. దాంతో ట్విట్టర్ రెవెన్యూ భారీగా కోల్పోతున్నాడు ఎలన్ మస్క్. అంతేకాకుండా ట్విట్టర్ కొనుగోలు, అభివృద్ధి కోసం తన టెస్లా షేర్లను అమ్ముకున్నాడు. ఈ దెబ్బతో కేవలం ఈ ఏడాదిలోనే 101 బిలియన్ డాలర్ల మస్క్ సంపద ఆవిరైపోయింది. అయినా 170 బిలియన్ డాలర్ల సంపదతో ఇప్పటికీ ప్రపంచ కుబేరుల జాబితాలో  నెంబర్ వన్ ప్లేస్ లో ఎలన్ మస్క్ కొనసాగుతున్నాడు.

బ్లూమ్-బర్గ్ వెల్త్ ఇండెక్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం, మస్క్ రోజుకు 2,500 కోట్ల సంపద కోల్పోతున్నాడు. టెస్లా కార్లలో తలెత్తిన లైటింగ్, ఎయిర్ బ్యాగ్స్-ల సాంకేతిక లోపంవల్ల దాదాపు మూడున్నర లక్షల టెస్లా కార్లను రీకాల్ చేశారు. దాంతో ఒక్కసారిగా షేర్లు పడిపోయాయి. ఇదేకాకుండా ట్విట్టర్ కు సంబంధించిన సమస్యలే మస్క్ సంపద ఆవిరైపోవడానికి కారణాలు.