
భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు చైనీయులను బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన జావో జింగ్, ఫూ కాంగ్ నేపాల్-భారత్ సరిహద్దు ప్రాంతంలోని రక్సాల్ మీదుగా ఇండియాలోకి ప్రవేశించేందుకు ఇద్దరు చైనీయులు జులై 22వ తేదీ శనివారం ప్రయత్నించారు. అయితే వీరిని బిహార్ లోని ఈస్ట్ చంపారన్ జిల్లా దగ్గర గుర్తించి భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే భారత్ లోకి ప్రవేశించేందుకు వీరి దగ్గర ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో.. గూఢచర్యం కోసం దేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఉంటారని భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నారు.
జులై 2నే అదుపులోకి..కానీ..
జావో జింగ్, ఫూ కాంగ్‌లు ఇద్దరు జులై 2వ తేదీనే భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని అసిస్టెంట్ ఫారినర్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎస్‌కె సింగ్ తెలిపారు. వారు తమ పాస్‌పోర్ట్‌లను భారత్ సరిహద్దు అవతల ఉన్న బిర్‌గంజ్‌లోని ఒక హోటల్‌లో వదిలివేసినట్లు పేర్కొన్నారు. అయితే ఆ రోజు అక్కడే బస చేసి..ఆ తర్వాతి రోజు ఆటోలో భారత సరిహద్దుకు చేరుకున్నట్లు చెప్పారు. కాలినడకన సరిహద్దును దాటేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. అయితే ఆ సమయంలో అదుపులోకి తీసుకోగా...అనుకోకుండా వచ్చామని చెప్పడంతో వార్నింగ్ ఇచ్చి..వారి పాస్ పోర్టులపై ప్రవేశం నిషేధం అని స్టాప్ వేసి పంపించామన్నారు. కానీ వారిద్దరు పదే పదే భారత్ లోకి చొరబడేందుకు యత్నించడంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ALSO READ:ఫేస్బుక్ ప్రియుడి కోసం ..పాకిస్తాన్కు వెళ్లిన భారత మహిళ
గూఢచర్యం కోసమేనా
చైనా పౌరులు భారత్ లోకి ఎందుకు ప్రవేశించారు.. పాస్ పోర్టులో దాచిపెట్టి రావాల్సిన అవసరం ఏమొచ్చిందన్న దానిపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గూఢచర్యం కోసమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోకి చొరబడిన చైనా జాతీయుల వింతగా ప్రవర్తన..పొంతన లేని సమాధానాలు గూఢచర్యం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.