
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న గుడి చెరువులో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల డెడ్ బాడీలు లభించాయి. బుధవారం స్థానికులు చూసి పోలీసులు సమాచారం అందించారు. వెంటనే వెళ్లి గజ ఈతగాళ్ల సాయంతో చెరువులోంచి డెడ్ బాడీలను బయటకు తీయించారు. మృతుల్లో ఒకరు 50 ఏండ్ల పైన, మరొకరికి 30 ఏండ్ల పైన వయసు ఉంటుంది.
ఇటీవల రాజన్న ఆలయానికి వేలాది మంది భక్తులు వచ్చారు. అయితే దర్శనం అనంతరం గుడి చెరువు మైదానంలో మద్యం తాగి ప్రమాదవశాత్తు అందులో పడ్డారా..? లేదా టాయిలెట్ కు వెళ్లగా పడిపోయారా..? అని పోలీసులు అనుమానిస్తున్నారు.
గత సోమ, మంగళవారాల్లో ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం తరలించామని పట్టణ సీఐ వీరప్రసాద్ చెప్పారు. ఇంకా వారిని గుర్తించలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు
తెలిపారు.