పాక్ లో ఇద్దరు ఇండియన్ హైకమిషన్ ఆఫీసర్లు మిస్సింగ్

పాక్ లో ఇద్దరు ఇండియన్ హైకమిషన్ ఆఫీసర్లు మిస్సింగ్

న్యూఢిల్లీ: పాకిస్తాన్ లో ఇద్దరు ఇండియన్ హైకమిషన్ ఆఫీసర్లు కనిపించకుండా పోయారు. ఇస్లామాబాద్ లోని ఇండియన్ ఎంబస్సీలో పనిచేస్తున్న ఇద్దరు ఆఫీసర్లు సోమవారం ఉదయం 8 గంటల నుంచి కనిపించడం లేదంటూ పాక్ ప్రభుత్వానికి మన అధికారులు కంప్లైంట్ చేశారు. ఈమధ్యే ఢిల్లీలోని పాక్ హైకమిషన్ లో పనిచేస్తున్న ఇద్దరు ఐఎస్ఐ ఏజెంట్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. పాక్ రాయబార కార్యాలయం ఉద్యోగుల ముసుగులో వీళ్లు కొన్నేళ్లుగా ఇండియాలో గూఢచర్యం కొనసాగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇది బయటపడినప్పటి నుంచి పాకిస్తాన్ లోని మన అధికారులపై అక్కడి అధికారులు వేధింపులకు పాల్పడటం ప్రారంభించారు. ఈ మధ్యే కారులో వెళ్తున్న ఇండియన్ అంబాసిడర్ ను పాక్ కు చెందిన నిఘా వ్యవస్థ ఐఎస్ఐ కి చెందిన ఒక వ్యక్తి బైక్ పై బెంబడించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ చర్యను ఇండియా తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ఘటనలు జరిగుతున్న క్రమంలోనే తాజాగా ఇద్దరు ఇండియన్ ఆఫీసర్లు అదృశ్యం కావడం అనుమానాలు రేకెత్తిస్తోంది.