డ్రోన్ తో అబుదాభి ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి

V6 Velugu Posted on Jan 17, 2022

యూఏఈ  రాజధాని అబుదాభి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి జరిగింది. డ్రోన్ సహాయంతో టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఎయిర్ పోర్టులోని ఇంధన వాహక ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ దాడిలో మూడు ఆయిల్ ట్యాంకర్లు పేలిపోవడంతో పాటు ముగ్గురు యువకులు చనిపోయారు. అందులో ఇద్దరు ఇండియన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.పెట్రోల్ ట్రక్కులు పేలిపోవడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. వాటిని ఆర్పేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు.. ఈ డ్రోన్ దాడులకు పాల్పడింది తామేనని యెమెన్ హౌతీ ఉగ్రవాదులు ప్రకటించారు.  హౌతీ ఉగ్రవాదులకు ఇరాన్ మద్దతు ఉంది. 2019 సెప్టెంబర్ లో సౌదీ అరేబియాలోని రెండు కీలక చమురు స్థావరాలపై హౌతీ ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో గల్ఫ్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

మరిన్ని వార్తల కోసం..

క్రిమినల్స్ కు ఎస్పీ టికెట్స్ ఇవ్వడంపై యోగి సీరియస్

 

Tagged Abu Dhabi, Three killed, Two Indians, suspected drone attack

Latest Videos

Subscribe Now

More News