రెండు అత్యాచారం కేసుల్లో సంచలన తీర్పులు. దోషులకు 20 ఏళ్లు జైలు

రెండు అత్యాచారం కేసుల్లో  సంచలన తీర్పులు. దోషులకు 20 ఏళ్లు జైలు

 తెలంగాణలో మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన రెండు వేర్వేరు కేసులకు సంబంధించి .. వేర్వేరు కోర్టులు సంచలన తీర్పులు వెలువరించాయి.  అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తులకు  20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానాను కోర్టులు విధించాయి.  అంతే కాకుండా  బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని కోర్టులు  ఆదేశాలు జారీ చేశాయి. వివరాల్లోకి వెళ్తే... 

 మొదటి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..నల్గొండకు చెందిన గ్రామానికి చెందిన  29 ఏళ్ల వ్యక్తి తన మైనర్​ మేనకోడలిపై పలుమార్లు అత్యాచారం చేశాడని  బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశౄరు.   కేసును విచారించిన ఫస్ట్​ క్లాస్​ మేజిస్ట్రేట్​ బి. తిరుపతి ..  దోషికి 20 ఏళ్లు కఠినకారాగార శిక్ష విధించారు.  దీనితో  ఆ వ్యక్తిరి రూ. 3 వేలు జరిమానాతో పాటు.. బాధితురాలికి రూ. 50 వేలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 

ఇక రెండవ కేసు విషయానికొస్తే ... ఈ కేసులో కూడా  మైనర్​ బాలికపై అత్యాచారం చేసిన 20 ఏళ్ల యువకుడికి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ పోక్సో ప్రత్యేక సెషన్స్ జడ్జి పి పుష్పలత తీర్పు ఇచ్చారు.  ఈ కేసులోని దోషికి రూ. 5 వేలు జరిమానాతో పాటు బాధితురాలికి రూ. లక్ష రూపాయిలు చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.  బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు 2018 లో నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేశారు.  అయితే దోషి .. బాధితురాలు నివసించే ప్రాంతానికి దగ్గరలోనే నివసించేవాడు.  మైనర్​ బాలికను బెదిరించి.. బలవంతంగా  పలుమార్లు అఘాయిత్యాలకు పాల్పడ్డాడని పోలీసులు కేసు నమోదు చేశారు.