రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వలస కూలీలు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వలస కూలీలు మృతి
  • రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వలస కూలీలు మృతి 
  • మృతులిద్దరూ అన్నదమ్ములే
  • బల్లెపల్లి - ఇల్లెందు రోడ్డుపై ప్రమాదం
  • యూపీలోని మహరాజ్​ గంజ్ స్వస్థలం

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని బల్లెపల్లి–ఇల్లెందు మెయిన్​రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ట్రక్ అదుపు తప్పి బోల్తా పడడంతో అన్నదమ్ములైన ఇద్దరు కూలీలు చనిపోయారు. ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్ గంజ్ జిల్లా కర్మహా గ్రామానికి చెందిన హీరాలాల్(30), జయరాజు(28) అన్నదమ్ములు. వీరిద్దరూ గ్లాస్ ఫిటింగ్ వర్క్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు వచ్చి పని ముగించుకుని ట్రక్​పై తిరిగి వెళ్తున్నారు. 

ఈ క్రమంలో బల్లెపల్లి–ఇల్లెందు మెయిన్​రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడడంతో అక్కడికక్కడే కన్నుమూశారు. ఖానాపురం హావేలి ఎస్సై వెంకన్న, అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు మృతదేహాలను ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.