ఇద్దరు ఖైదీలు .. జైల్లో లవ్.. పెరోల్ పై బయటకు వచ్చి పెళ్లి

 ఇద్దరు ఖైదీలు ..  జైల్లో లవ్.. పెరోల్ పై బయటకు వచ్చి పెళ్లి

ప్రేమ ఎప్పుడూ ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. ఇద్దరి మధ్య  ప్రేమ ఎప్పుడైనా పుట్టొ్చ్చు.   వేర్వేరు హత్య కేసుల్లో దోషులుగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఇద్దరు ఖైదీల మధ్య ప్రేమ చిగురించి పెళ్లికి దారీ తీసింది.  ఈ ఘటన  పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది.   అబ్దుల్ హసీమ్(అస్సాం)కు 8 ఏళ్లు , షహనారా ఖతున్ (బెంగాల్) కు 6 ఏళ్లు జైలు శిక్ష పడటంతో వీరిద్దిరిని పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్‌లో శిక్ష అనుభవిస్తు్న్నారు. 

అక్కడ వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా, ప్రేమగా మారింది. ఆ తరువాత ఇద్దరు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. దీంతో  ఐదు రోజుల పెరోల్‌పై బయటకు వచ్చి ముస్లిం చట్టం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆ తరువాత తిరిగి జైలుకు వెళ్లిపోయారు.  జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత సాధారణ జీవితాన్ని గడపాలని అనుకుంటున్నామని వెల్లడించారు.