మంటలార్పబోయి.. ఇద్దరు ఫైర్ సిబ్బంది మృతి

మంటలార్పబోయి.. ఇద్దరు ఫైర్ సిబ్బంది మృతి

గౌహతి: అస్సాంలోని  టాక్సికియా జిల్లా బాగేజన్ గ్యాస్ బావిలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు వెళ్లిన ఫైర్ సిబ్బందిలో ఇద్దరు చనిపోయారు. వీరి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నామని అస్సాం చీఫ్ సెక్రటరీ కుమార్ సంజయ్ కృష్ణ చెప్పారు.  మే 27 న బాగేజన్ ఆయిల్ ఫీల్డ్ లో భాగమైన ఓ చమురు బావి దెబ్బతింది. అప్పటి నుంచి ఫీల్డ్ నుంచి గ్యాస్ వెలువడుతూ మంటలు చెలరేగాయి. ఇవి వ్యాప్తి చెందటంతో ఫైర్ స్టాఫ్​ రంగంలోకి దిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ముగ్గురు ఫైర్ ఫైటర్స్ గల్లంతయ్యారు.

వీరిలో ఇద్దరు చనిపోవటంతో వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరొకరి ఆచూకీ ఇంకా తెలియలేదు. చనిపోయిన ఇద్దరు ఫైర్ ఫైటర్స్ ఓఎన్జీసీ సంస్థకు చెందినవారు. ఆయిల్ ఇండియా లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన 15 మంది అగ్ని మాపక సిబ్బందితో పాటు ఓఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీసీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఐఏఎఫ్), డిస్ట్రిక్ట్ ఫైర్ సర్వీసెస్ మంటలను ఆర్పే పనిలో ఉన్నాయి. మంటలను కంట్రోల్ చేసేందుకు మరో 4 వారాలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో  పలు ఇళ్లు, చెట్లు  కాలిపోవడంతో పాటు  పంట పొలాలు కూడా దెబ్బతిన్నాయి.

మరిన్ని వార్తల కోసం

బతుకు భరోసా లేని జర్నలిస్టులు

ఒక్కొక్కరికీ 12 గంటల డ్యూటీ!