
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో మరో ఇద్దరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోనే అతిపెద్ద పారామిలటరీ దళంలో మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 28కి చేరిందని అధికారులు మంగళవారం తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ ర్యాంకు సిబ్బంది ఆంధ్రప్రదేశ్, కేరళలోని తమ ఇళ్ల వద్ద సెలవుల్లో ఉన్నారని అధికారులు చెప్పారు. మంగళవారం ఒక్కరోజే కొత్తగా మరో 51 కరోనా కేసులు నమోదు కాగా 424 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు సీఆర్ పీఎఫ్ లో 6,130 మందికి కరోనా సోకగా 2,131 యాక్టివ్ కేసులున్నాయి.