డబుల్ మీనింగ్ యాడ్స్ పై తీవ్ర దుమారం

డబుల్ మీనింగ్ యాడ్స్ పై తీవ్ర దుమారం

భారత్‌కు చెందిన పర్‌ఫ్యూమ్‌, డియోడ్రంట్‌, స్ప్రే తయారీదారు కంపెనీ లేయర్స్‌.. తాజాగా రూపొందించిన రెండు యాడ్స్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండూ యాడ్స్ కూడా డబుల్‌ మీనింగ్‌ ఉద్దేశ్యంతో.. యువతులను అగౌరవపరిచేలా, కించపరిచేలా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. అత్యాచార సంస్కృతిని పెంపొందించేలా యాడ్స్ ఉన్నాయని చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 

ఓ షాపింగ్‌మాల్‌లో కొందరు ఫ్రెండ్స్, ఓ యువతి మధ్య ఒక యాడ్ రూపొందించారు. మరో యాడ్ ను ఓ రూమ్ లో ఓ యువజంట‌ ఏకాంతంగా ఉండగా, అదే సమయంలో అతడి ఫ్రెండ్స్ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో జరిగే సంభాషణల ఆధారంగా ఈ యాడ్స్‌ను రూపొందించారు. ఈ రెండు యాడ్స్‌ మెయిన్‌ థీమ్‌ కూడా ‘షాట్‌’ను ప్రమోట్‌ చేసేదే. అయితే ప్రమోషన్‌ సంగతి ఎలా ఉన్నా.. దీని వెనుక డర్టీ ఆలోచన ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. 

ఇంగ్లండ్‌ న్యూజిలాండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ యాడ్స్‌ను టెలికాస్ట్‌ చేశారు. అడ్వర్‌టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ASCI) సోషల్‌ మీడియాలో ఈ రెండు షాట్‌ యాడ్స్‌ దుమారంపై స్పందించింది. ఆ యాడ్స్‌ను తొలగించడంతో పాటు దర్యాప్తునకు ఆదేశించినట్లు ట్విటర్‌లో పేర్కొంది.  ఈ రెండు యాడ్స్ ను ట్విట్టర్, యూట్యూబ్ నుంచి తొలగించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

మరిన్ని వార్తల కోసం..

కాఫీ ఆర్డర్ చేస్తే... చికెన్ ముక్క వచ్చింది

మహారాష్ట్రలో పెరుగుతున్న కొవిడ్ కేసులు