ఫోన్ చేసుకొని ఇస్తానంటూ మొబైల్ చోరీకి య‌త్నం.. ఇద్ద‌రు అరెస్ట్‌

ఫోన్ చేసుకొని ఇస్తానంటూ మొబైల్ చోరీకి య‌త్నం.. ఇద్ద‌రు అరెస్ట్‌

ప్ర‌కాశం: అత్య‌వ‌స‌రంగా ఫోన్ కాల్ చేసుకోవాల‌ని, చాలా అవ‌స‌ర‌మ‌ని.. ఓ వ్య‌క్తి నుంచి మొబైల్ లాక్కొని.. దానిని చోరీ చేసేందుకు య‌త్నించారు ఇద్ద‌రు దొంగ‌లు. ఆ దారి గుండా వెళుతున్న వ్య‌క్తులు వారిని  గ‌మ‌నించి అడ్డుకొని స్థానిక పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. ప‌ర్చూరు మండ‌లం ఇన‌గ‌ల్లుకు చెందిన డేవిడ్ రాజు బైక్ మీద వెళుతుండగా చీరాలకి చెందిన ఇద్దరు యువకులు స్కూటీపై అత‌న్ని ఫాలో చేశారు. కొంచెం దూరం వెళ్ల‌గానే.. అత‌ని బైక్ ని ఆపి,”అన్నా ఫోన్ ఇవ్వవా.. ఫోన్ చేసుకొని ఇస్తాను” అంటూ అతని చేతిలో ఫోన్ లాక్కొన్నారు. వారిపై సందేహించిన‌‌ డేవిడ్ రాజు.. “నేను ఇవ్వను. నాకు ఫోన్ వస్తుంది” అని మొబైల్‌ని గ‌ట్టిగా పట్టుకొని ఇవ్వకపోవడంతో డేవిడ్ తల, మెడ మీద కొట్టి అక్క‌డి నుంచి మొబైల్‌తో ప‌రార‌య్యారు. దారిలో వెళుతున్న వ్యక్తులు వారిని చూసి అడ్డుకొని ప‌ట్టుకున్నారు. వారి నుంచి మొబైల్ స్వాధీనం చేసుకొని, పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు ఆ ఇద్ద‌ర్నీ పర్చూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు.