
బషీర్బాగ్, వెలుగు: ఆర్మీలో ఉద్యోగాల పేరిట యువతను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, అందుకు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుత టెక్నాలజీ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ నయా మోసాలు చేస్తున్నారని తెలిపారు.
ఆర్మీలో జాయినింగ్స్ అంటూ సోషల్ మీడియాలో లింక్స్ పంపుతున్నారని, తొందరపడి క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ కావడమే కాకుండా వ్యక్తిగత సమాచారం చోరీ అయ్యే ప్రమాదం ఉందన్నారు. అలాంటి లింక్ లను ఫార్వర్డ్ చేయకుండా, అఫీషియల్ గా వేరిఫై చేసుకోవాలని సూచించారు.