గుద్దినా ఏంకాదు : ఈ రెండు టాటా కార్లకు.. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్

గుద్దినా ఏంకాదు : ఈ రెండు టాటా కార్లకు.. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్

టాటా మోటార్స్ కు అభినందనలు.. ఇది చెప్పింది ఎవరో కాదు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ.. దీనికి కారణం ఏంటో తెలుసా.. టాటా మోటార్స్ కు చెందిన రెండు కార్లు భద్రత విషయంలో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించాయి. అవి ఏంటో తెలుసా.. టాటా న్యూ సఫారీ.. టాటా హేరియర్ కార్లు.. కార్ల భద్రత, రక్షణ విషయంలో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో NCAP పరీక్షలు నిర్వహిస్తుంది. భారత్ ఎన్సీఏపీ అంటే.. భారత్ న్యూ కార్ ఎసెస్ మెంట్ ప్రొగ్రామ్.. ఈ పరీక్షల కింద.. కారు ఢీకొన్నప్పుడు ఎలాంటి డ్యామేజ్ అవుతుంది అని నిర్థారిస్తారు. ఎంత తక్కువ డ్యామేజ్ అయితే.. ఎంత ఎక్కువ రేటింగ్ ఇస్తారు.. కనీస వేగం 20 నుంచి అత్యధికంగా కారులోని స్పీడ్ మీటర్ ఎంత ఉంటుందో.. అంత వరకు కొత్త కార్లను పరీక్షిస్తారు. 

ఇలా కార్ల భద్రత, రక్షణకు సంబంధించి.. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన NCAP పరీక్షల్లో టాటా న్యూ సఫారీ, టాటా హేరియర్ కార్లు 5 (ఫైవ్) స్టార్ రేటింగ్ దక్కించుకున్నాయి. అత్యంత ధృఢంగా ఈ కార్లు ఉన్నాయని.. యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా తక్కువ డ్యామేజ్ అవుతుందని.. కార్లలోని వ్యక్తులకు అత్యంత రక్షణ వ్యవస్థ.. ఈ కార్లలో ఉందని నిర్థారిస్తూ.. టాటా మోటార్స్ కు ఈ సర్టిఫికెట్లు జారీ చేయటం జరిగింది.

టాటా కార్లకు ఇటీవల డిమాండ్ విపరీతంగా పెరిగింది. కొత్త మోడల్ కార్లను పెద్ద ఎత్తున మార్కెట్ లోకి విడుదల చేస్తుంది. ఈ టాటా సఫారీ పాతదే అయితే.. న్యూ సఫారీ పేరుతో.. కొత్త టెక్నాలజీతో మార్కెట్ లోకి వచ్చింది. ఈ కారు సేఫ్టీ విషయంలో ఫైవ్ స్టార్ దక్కించుకోగా.. హేరియర్ కారు సైతం ఇదే విధంగా 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే నితిన్ గడ్కారీ.. టాటా మోటార్స్ కు అభినందనలు తెలిపారు.