చంద్రబాబుకు వరుసగా తప్పిన రెండు ప్రమాదాలు

చంద్రబాబుకు వరుసగా తప్పిన రెండు ప్రమాదాలు

చంద్రబాబును యాదృచ్చికంగా ప్రమాదాలు వెంటాడుతున్నాయి.  ఈ రోజు ( జనవరి 29) న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలోని కాతేరులో నిర్వహించిన సభలో వేదికపై తోపులాట జరగ్గా...మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కిందపడ బోగా... భద్రతా సిబ్బంది చేతులు అడ్డుపెట్టి కాపాడారు. జనవరి 20 వ తేదీన విశాఖ నుంచి  అరకుకు హెలికాప్టర్​లో వెళుతున్న సమయంలో దారితప్పింది.సాంకేతిక కారణాల కారణంగా రాంగ్‌రూట్‌లో వెళ్లిపోయింది. ఇది గమనించిన ఏటీసీ సిబ్బంది.. వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. దీంతో సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు.

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలోని కాతేరులో నిర్వహించిన   రా... కదలి రా సభలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. ఈ సభకు భారీ ఎత్తున జనాలు హాజరయ్యారు. కాగా, సభ ముగిసిన అనంతరం వేదికపై తోపులాట చోటుచేసుకుంది. చంద్రబాబు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది. దాంతో ఆయన వేదిక అంచు వరకు వచ్చి నిలబడ్డారు. అప్పటికీ జనం తోసుకుంటూనే ఉండడంతో చంద్రబాబు జారి కిందపడబోయారు. మెరుపువేగంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది తమ చేతులు అడ్డుపెట్టి చంద్రబాబు కిందపడకుండా కాపాడారు. అక్కడున్న జనంపై చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయనను అక్కడ్నించి సురక్షితంగా తీసుకెళ్లారు. 

రాజానగరం టికెట్ ను జనసేనకు ప్రకటించడంపై స్థానిక టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బొడ్డు వెంకట రమణ వర్గీయులు స్టేజిపై ఆందోళన చేశారు. అనంతరం స్టేజిపై నుంచి కార్యకర్తలు ఒక్కసారిగా కిందకు దూకడంతో చంద్రబాబు పడబోయారు. ఇదే సమయంలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై.. చంద్రబాబును పడిపోకుండా పట్టుకున్నారు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇక కార్యకర్తల తీరుపై చంద్రబు అసహనం వ్యక్తం చేశారు.

జనవరి 20న రాంగ్​ రూట్​లో హెలికాప్టర్​..

10 రోజుల కితం ( జనవరి 20)  చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ మిస్సయింది.  సాంకేతిక కారణాల కారణంగా రాంగ్‌రూట్‌లో వెళ్లిపోయింది. ఇది గమనించిన ఏటీసీ సిబ్బంది.. వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. దీంతో సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు. రా కదలిరా సభలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి అరకుకు హెలికాప్టర్‌లో బయల్దేరారు. హెలికాప్టర్‌ బయల్దేరిన కొద్దిసేటికే అందులో సాంకేతిక కారణాల వల్ల సమన్వయ లోపం తలెత్తింది. దీంతో ఏటీసీ ఇచ్చిన రూట్‌మ్యాప్‌ అర్థం చేసుకోవడంలో పైలట్‌ గందరగోళానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఒకవైపు వెళ్లాల్సిన హెలికాప్టర్‌ను మరోవైపు తీసుకెళ్లాడు. రాంగ్‌రూట్‌లో హెలికాప్టర్‌ వెళ్తున్నట్లు గమనించిన ఏటీసీ సిబ్బంది వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. హెలికాప్టర్‌ను వెనక్కి పిలిపించి.. మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు అనుమతినిచ్చారు. ఏటీసీ అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన తర్వాత హెలికాప్టర్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయకు సురక్షితంగా చేరుకున్నారు.