యూనిఫాంలో నాగిని డ్యాన్స్‌... ఎస్సై, కానిస్టేబుల్‌ సస్పెండ్

యూనిఫాంలో  నాగిని డ్యాన్స్‌... ఎస్సై, కానిస్టేబుల్‌ సస్పెండ్

యూనిఫాంలో ఉన్న ఓ ఎస్సై, కానిస్టేబుల్‌ చేసిన ‘నాగిని డాన్స్‌’ వారి ఉద్యోగాలకు ఎసరు పెట్టింది. డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అధికారులు వారిపై  చర్యలు తీసుకున్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌ ను సస్పెండ్ చేశారు. స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకల్లో భాగంగా  యూపీలోని కొత్వాలీ జిల్లాలోని పురాన్‌పూర్ పోలీస్ స్టేషన్ లో  జెండా ఎగురవేసిన  అనంతరం  ఇద్దరు పోలీసులు నాగిని పాటకు స్టెప్పులేశారు. అక్కడే ఉన్న ఇతర పోలీసు సిబ్బంది కూడా వారిని ఎంకరేజ్ చేశారు. అయితే దీనిని ఎవరో ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.  

పోలీసుల నాగిని డాన్స్ వీడియో కాస్తా ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లడంతో వారిపై వేటు వేశారు. యూనిఫాంలో ఉండి అలాంటి స్టెప్పులేసినందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదికను సమర్పించాలని ఎస్పీని కోరారు. అయితే ఈ వీడియోకు నెటిజన్ల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ రావడం గమనార్హం. ఇప్పటివరకు దాదాపు 75వేల మందికిపైగా ఈ వీడియోను చూశారు.