చైనాలో రెండు వ్యాక్సిన్లు ఎమర్జెన్సీ యూజ్ కు ఓకే

చైనాలో రెండు వ్యాక్సిన్లు ఎమర్జెన్సీ యూజ్ కు  ఓకే

బీజింగ్: కరోనా వైరస్కు కారణమైన చైనాలో వ్యాక్సిన్ తయారీ రేస్ జోరుగా సాగుతోంది. వైరస్ వ్యాప్తి మీద ఎన్నెన్నో విమర్శలు ఎదుర్కొన్న చైనాలోనే మొదటగా వ్యాక్సిన్ల తయారీకి బీజం పడింది. వైరస్కు సంబంధించిన జెనెటిక్ సీక్వెన్స్లు, ప్రొటీన్ స్ట్రక్చర్ల సమాచారాన్ని చైనా సైంటిస్టులే రిలీజ్ చేశారు. అంతేకాదు.. వ్యాక్సిన్ తయారీలోనూ ఇప్పుడు వేగంగా ముందుకు పోతున్నారు. నాలుగు వ్యాక్సిన్లు ఫేజ్ 3 ట్రయల్స్  దశకు వచ్చేశాయి. అందులో రెండు వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వాడకానికి చైనా సర్కార్ అనుమతి కూడా ఇచ్చిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. సినోవ్యాక్ బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్, చైనా నేషనల్ ఫార్మాస్యుటికల్ గ్రూప్ (సినోఫార్మ్)కు చెందిన చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ (సీఎన్బీజీ) తయారు చేసిన వ్యాక్సిన్లకు అప్రూవల్ ఇచ్చినట్టు చెప్పారు. అయితే, సీఎన్ బీజీ రెండు వ్యాక్సిన్ క్యాండిడేట్లపై పనిచేస్తోంది. ఏ వ్యాక్సిన్కు అప్రూవల్ వచ్చిందన్నది మాత్రం తెలియలేదు. ముందుగా రిస్క్గ్రూప్లో ఉండే డాక్టర్లకు  ఆ వ్యాక్సిన్లను ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

నాలుగు వ్యాక్సిన్క్ క్యాండిడేట్లపై విదేశాల్లో మూడో ఫేజ్ ట్రయల్స్ మొదలయ్యాయని స్టేట్ కౌన్సిల్ జాయింట్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ మెకానిజమ్ ఎగెయ్నెస్ట్ కోవిడ్19 చెప్పింది. ఈ ఫేజ్3 ట్రయల్స్ను చైనాలో కాకుండా వేరే దేశాల్లో చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ మహమ్మారి దాదాపు కంట్రోల్ కావడం, అక్కడ ట్రయల్స్ చేసే పరిస్థితి లేకపోవడంతోనే విదేశాల్లో చేస్తున్నట్టు అధికారులు వివరిస్తున్నారు. సీఎన్బీజీ తయారు చేస్తున్న రెండు వ్యాక్సిన్ల పై మిడిల్ ఈస్ట్, సౌత్ అమెరికాల్లో 30 వేల మందిపై ట్రయల్స్ చేయనున్నారు. సౌత్అమెరికా, సౌత్ఈస్ట్ ఏసియాల్లో సినోవ్యాక్ బయోటెక్ కంపెనీ లిమిటెడ్కు చెందిన ఇనాక్వేటెడ్ టి వ్యాక్సిన్పై ట్రయల్స్చేయనున్నారు. అడినోవైరస్లను మోడిఫై చేసి తయారు చేసిన రీకాంబినెంట్ కరోనా వ్యాక్సిన్పైనా ట్రయల్స్ మొదలు కానున్నాయి. అయితే, ఫేజ్3 ట్రయల్స్ లేకుండానే చైనా జనాలకు జులై నుంచే వ్యాక్సిన్లు ఇస్తున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి.