
టూవీలర్ కంపెనీ టీవీఎస్, అపాచి ఆర్‌టీఎక్స్‌ను రూ.1.99 లక్షల ప్రారంభ ధర (ఎక్స్‌షోరూమ్)తో లాంచ్ చేసింది. ఇది బేస్, టాప్, బీటీఓ వేరియంట్లలో లభిస్తుంది. బీటీఓ ధర రూ.2.29 లక్షలు. 299సీసీ ఆర్‌టీ-ఎక్స్‌డీ4 ఇంజిన్ 36హెచ్‌పీ పవర్, 28.5ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్, క్రూజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, 4 రైడింగ్ మోడ్స్, అల్లాయ్ వీల్స్, డ్యూయల్ -స్పోర్ట్ టైర్స్, టీఎఫ్‌టీ డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్స్, మిర్రరింగ్ వంటి ఫీచర్లు ఈ బండిలో ఉన్నాయి.