సముద్రంలో మునిగి ఇద్దరు యువకుల మృతి

సముద్రంలో మునిగి ఇద్దరు యువకుల మృతి

వినాయక చవితి పండుగ రోజు అందరూ కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతుంటే.. ప్రకాశం జిల్లాలోని రెండు కుటుంబాల్లో మాత్రం విషాదం నెలకొంది. పండుగ సందర్భంగా సరదాగా సింగరాయకొండ మండలం పాకల సముద్రం దగ్గరకు ఈత కోసం వచ్చిన ఆరుగురు స్నేహితుల్లో ఇద్దరు చనిపోయారు. 

యువకులంతా బందువులు కావడంతో ఒకరికొకరు ఫోన్లు చేసుకోని పాకల సముద్రతీర ప్రాంతానికి వెళ్లారు. ఈత కొట్టేందుకు లోతులోకి వెల్లడంతో అలల తాకిడికి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. దీంతో అదే సమయంలో అక్కడే ఉన్న పర్యాటకులు కేకలువేయడంతో.. సమీపంలో ఉన్న మెరైన పోలీసులు ఓ యువకున్ని కాపాడారు. మరో ఇద్దరు మృతిచెందడంతో వారి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు.

మృతిచెందిన ఆ యువకులను మర్రిపూడి మండలం చిమట గ్రామానికి చెందిన శాంతి రాజు(22), చీమకుర్తి మండలం చిన్న రాగిపాడు గ్రామానికి చెందిన జన్నిపోగు తేజ(18) గా మెరైన్ పోలీసులు గుర్తించారు. వీరిలో తేజ పాలిటెక్నిక్ చదువుతుండగా మిగతా యువకులంతా హైదరాబాద్ లోని చుట్టుపక్కప్రాంతాల్లో బేల్ధారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.