అత్యంత విస్మయానికి గురి చేసే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఏరియల్ వ్యూకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను ప్రముఖ వ్యోమగామి సుల్తాన్ అల్ నెయాడి ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆరు నెలల అంతరిక్ష యాత్రలో ఉన్న ఆయన.. ఇటీవల అంతరిక్షం నుంచి దుబాయ్ లోని నివాసాలను చూపే ఓ ఏరియల్ వ్యూను పంచుకున్నారు. ఈ వీడియోలో మైమరిపిస్తోన్న ప్రకాశవంతమైన వెలుగులను చూస్తోంటే.. దీన్ని రాత్రి సమయంలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. అంతరిక్షం నుంచి వచ్చిన నక్షత్రాల వలె కనిపిస్తోన్న దుబాయ్ వ్యూకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అల్ నెయాడి షేర్ చేసిన ఈ వీడియో అందర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది. దీనికి యూజర్స్ పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. విస్మయం కలిగించేదిగా ఉందని కొందరంటున్నారు. మరికొందరేమో తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, ఈ చిత్రాన్ని అద్భుతమైన, అందమైన, నమ్మశక్యం కానిదిగా అభివర్ణిస్తున్నారు. ఇది బ్రహ్మాండంగా కనిపిస్తుంది. గొప్ప షాట్ అంటూ ఇంకొందరు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 10వేల కంటే ఎక్కువ లైకులు వచ్చాయి.
https://twitter.com/Astro_Alneyadi/status/1653350755804299264