దేశంలో 24 న‌కిలీ యూనివ‌ర్శిటీలు: UGC

దేశంలో 24 న‌కిలీ యూనివ‌ర్శిటీలు: UGC

దేశవ్యాప్తంగా ఉన్న నకిలీ యూనివర్సిటీల లిస్టును ప్రకటించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. దేశంలో గుర్తింపు లేకుండా చెలామణీ అవుతున్న ఫేక్ యూనివర్శిటీలు 24 వరకు ఉన్నాయని UGC తెలిపింది. ఇందులో అత్యధిక ఫేక్ యూనివర్శిటీలు  ఎక్కువగా  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండగా తర్వాతి స్థానంలో ఢిల్లీలో ఉన్నాయంది. యూజీసీ చట్టానికి విరుద్ధంగా కొనసాగుతున్న స్వయం ప్రకటిత, గుర్తింపులేని వర్శిటీలు 24 వరకు ఉన్నాయని… విద్యార్ధులు, తలిదండ్రులకు తెలియజేస్తున్నామని చెప్పింది. UGC వీటిని నకిలీ యూనివర్శిటీలుగా ప్రకటించింది. వీటికి ఎలాంటి డిగ్రీలూ ఇచ్చే అధికారం లేదు… అంటూ UGC సెక్రటరీ రజనీశ్ జైన్ తెలిపారు.

ఇందులో ఎనిమిది ఉత్తర ప్రదేశ్ లో ఉండగా.. ఢిల్లీ లో ఏడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో రెండేసి చొప్పున ఉన్నాయి. కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, మహారాష్ట్ర , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఫేక్ వర్శిటీలు ఉన్నట్టు UGC తెలిపింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. పిల్లల భవిష్యత్ దృష్ట్యా నకిలీ యూనివర్శిటీల లిస్టును ప్రకటిస్తున్నామని చెప్పింది . గుంటూరు కేంద్రంగా న‌డుస్తున్న క్రిస్ట్ న్యూ టెస్ట్ మెంట్ డీమ్డ్ యూనివ‌ర్శిటీల న‌కిలీ వ‌ర్శిటీగా UGC ప్ర‌క‌టించింది.