ఉజ్జయినీ మహంకాళి టెంపుల్ హుండీ ఆదాయం రూ.62.44 లక్షలు

ఉజ్జయినీ మహంకాళి టెంపుల్ హుండీ ఆదాయం రూ.62.44 లక్షలు

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థాన హుండీ లెక్కింపును గురువారం నిర్వహించారు. ఆషాఢ మాస బోనాల జాతర 34 రోజులకు సంబంధించి హుండీలను తెరవగా.. రూ.62,44,500 వచ్చాయి. ఇందులో 320 అమెరికా, 5 కెనడా డాలర్లు ఉన్నాయి. అంతేగాకుండా 56 గ్రాముల బంగారం,1,150 గ్రాముల వెండి కానుకలు వచ్చాయి. కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్​స్పెక్టర్​ శ్రీదేవి, ఈవో మనోహర్​రెడ్డి, సురిటి రామేశ్వర్​ పాల్గొన్నారు.