ఐపీఎల్‌‌ ఫేజ్‌‌–2కు యూకే బెస్ట్‌‌

ఐపీఎల్‌‌ ఫేజ్‌‌–2కు యూకే బెస్ట్‌‌

లండన్‌‌: ఐపీఎల్‌‌ ఫేజ్‌‌–2 మ్యాచ్‌‌లను బ్రిటన్​లో నిర్వహించాలని ఇంగ్లండ్‌‌ మాజీ కెప్టెన్‌‌ కెవిన్‌‌ పీటర్సన్‌‌ అన్నాడు. వీలైతే సెప్టెంబర్‌‌లో మ్యాచ్‌‌ల నిర్వహణకు బీసీసీఐ సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశాడు. ‘ఐపీఎల్‌‌ను యూకేకు తరలించడం అత్యుత్తమ నిర్ణయమని నా అభిప్రాయం. ఇండియా, ఇంగ్లండ్‌‌ సిరీస్‌‌ ముగిసిన వెంటనే సెప్టెంబర్‌‌లో కచ్చితంగా ఖాళీ విండో లభిస్తుంది. ఈ విషయం గురించి యూకేలోనూ చర్చించుకుంటున్నారు. టీమిండియా ప్లేయర్లు కూడా ఇక్కడే ఉంటారు. కాబట్టి ఫారిన్‌‌ క్రికెటర్లు ఈజీగా ఇక్కడికి వచ్చేస్తారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మిగతా మ్యాచ్‌‌లను కంప్లీట్‌‌ చేసుకోవచ్చు’ అని పీటర్సన్‌‌ పేర్కొన్నాడు. సెప్టెంబర్‌‌లో యూకేలో వెదర్‌‌ కూడా అద్భుతంగా ఉంటుందన్నాడు. మాంచెస్టర్‌‌, లీడ్స్‌‌, బర్మింగ్‌‌హామ్‌‌తో పాటు లండన్‌‌లో రెండు గ్రౌండ్స్‌‌ను సూపర్‌‌గా ఉపయోగించుకోవచ్చన్నాడు. గ్రౌండ్స్‌‌లోకి క్రౌడ్‌‌ను కూడా అనుమతించే చాన్స్‌‌ ఉందన్నాడు. యూఏఈ, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాను పక్కనబెట్టి ఇంగ్లండ్‌‌లో మ్యాచ్‌‌లు నిర్వహిస్తే చాలా బాగుంటుందని పీటర్సన్‌‌ చెప్పుకొచ్చాడు.