బ్రిటన్​లో చదివితే రెండేళ్ల వర్క్​ వీసా

బ్రిటన్​లో చదివితే  రెండేళ్ల వర్క్​ వీసా

    తొమ్మిదేళ్ల క్రితం విధానానికి మళ్లీ అనుమతి

    ఇండియన్​ స్టూడెంట్లకు ప్రయోజనం

లండన్: ఫారిన్​ స్టూడెంట్ల కోసం కొత్తగా రెండేళ్ల పోస్ట్​ స్టడీ వర్క్​ వీసాను బ్రిటన్​ సర్కారు అందుబాటులోకి తెచ్చింది. బ్రిటన్​ యూనివర్సిటీల్లో ఇండియన్​ స్టూడెంట్ల సంఖ్యను పెంచేందుకు ఈ వీసాను అందుబాటులోకి తేవాలని ఎప్పటి నుంచో డిమాండ్​ ఉంది. దీనిపై బుధవారం బ్రిటన్​ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త వీసా విధానం వచ్చే ఏడాది నుంచి అమలులోకి వస్తుంది. వ్యాలీడ్ యూకే ఇమ్మిగ్రేషన్​ స్టేటస్​ కలిగిన ఫారిన్​ స్టూడెంట్లు ఈ వీసాకు అర్హులు. బ్రిటన్​ ప్రభుత్వం ఆమోదం పొందిన ఏదైనా ఓ హైయ్యర్​ ఎడ్యుకేషన్​ ఇనిస్టిట్యూట్​లో ఏ సబ్జెక్ట్​లో అయినాసరే అండర్​గ్రాడ్యుయేట్​ లెవెల్​ లేదా అంతకంటే ఎక్కువ పూర్తి చేసి ఉండాలి. అప్పుడు ఆ స్టూడెంట్లు రెండేళ్ల పాటు తమకు నచ్చిన చోట పనిచేసే అవకాశం లభిస్తుంది.

రెండేళ్ల తర్వాత వారు ఏదైనా జాబ్​ సంపాదిస్తే స్కిల్డ్​ వర్క్​ వీసాకు మారవచ్చు. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం అప్పటి బ్రిటన్​ ప్రధాని థెరిసా మే.. ఈ వీసా విధానాన్ని రద్దు చేశారు. అప్పటి నుంచి బ్రిటన్​కు వెళ్లే ఇండియన్ స్టూడెంట్ల సంఖ్య ఏటా తగ్గుతూ వచ్చింది. దీంతో రెండేళ్ల పోస్ట్​ స్టడీ వర్క్​ వీసాను మళ్లీ తీసుకొస్తూ బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ నిర్ణయం తీసుకున్నారు. ‘‘ట్యాలెంట్​ ఉన్న ఫారిన్​ స్టూడెంట్లు బ్రిటన్​ వచ్చి చదువుకునేందుకు ఈ వీసా ఉపయోగ పడుతుంది. ఆ తర్వాత వర్క్​ ఎక్స్​పీరియన్స్​ద్వారా సక్సెస్​ఫుల్​ కెరీర్​ను వారు లీడ్ చేయగలుగుతారు”అని బ్రిటన్​ హోం మంత్రి ప్రీతి పటేల్​ చెప్పారు.