బ్రిటన్ వీసా సిస్టమ్ ​లో ఇంగ్లీష్ ​స్కిల్స్​కు ర్యాంకులు!

బ్రిటన్ వీసా సిస్టమ్ ​లో ఇంగ్లీష్ ​స్కిల్స్​కు ర్యాంకులు!

బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తమ వీసా విధానంలో మార్పులు చేసేందుకు బ్రిటన్ ప్రతిపాదనలు రెడీ చేస్తోంది. ఈ మేరకు విధివిధానాలను యూకే హోం సెక్రెటరీ ప్రీతి పటేల్ ఫైనలైజ్ చేస్తున్నారు. వీసాకు దరఖాస్తు చేసే వ్యక్తి నైపుణ్య స్థాయిని బట్టి ఇంగ్లీష్ స్కిల్స్​కు ర్యాంకులు ఇవ్వనున్నారు. ఆస్ర్టేలియాలో ప్రస్తుతం ఉన్న ‘పాయింట్స్ బేస్డ్ ఇమిగ్రేషన్​సిస్టమ్’​ను అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంగ్లీష్ ​ప్రొఫిషియన్సీతో పాటు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, వర్క్ ఎక్స్​పీరియన్స్..  తదితర అంశాలను కొత్త ఇమిగ్రేషన్ ​సిస్టమ్​లో పరిగణనలోకి తీసుకోనున్నారు.

ఆస్ట్రేలియా పాయింట్ల సిస్టమ్ ప్రకారం.. ‘సుపీరియర్ ఇంగ్లీష్’ ఉన్న స్కిల్డ్ మైగ్రెంట్లకు 20 పాయింట్లు ఇస్తున్నారు. అయితే ఇందుకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఏదైనా ల్యాంగ్వేజీ టెస్టులో 8 లేదా అంతకన్నా ఎక్కువ స్కోర్ సాధించాలి. తర్వాత 7 మార్కులు సాధించిన ‘ప్రొఫిసియెంట్ ఇంగ్లిష్’ మైగ్రెంట్లకు 10 పాయింట్లు ఇస్తున్నారు. ‘కంపీటెంట్ ఇంగ్లీష్’ కలిగిన వారికి మాత్రం ఎలాంటి పాయింట్లు రావు. ఇటీవల విధించిన గడువు ప్రకారం యూరోపియన్ ​యూనియన్ (ఈయూ) నుంచి అక్టోబర్​31లోగా బ్రిటన్ ​బయటికి రావాల్సి ఉంది.