12 వేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టినం

12 వేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టినం

ఉక్రెయిన్, రష్యా మధ్య 14 రోజులగా భీకర యుద్ధం సాగుతోంది. నాటో, యూరోపియన్ యూనియన్ దేశాలు తీవ్ర స్థాయిలో ఆంక్షలు విధిస్తున్నా సరే రష్యా తలొగ్గకుండా దండయాత్ర చేస్తూనే ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని పలు సిటీలను రష్యన్ బలగాలు తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నాయి. అయితే రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలను ఉక్రెయిన్ సైనికులు దీటుగా ఎదుర్కొంటున్నారు. రష్యా సేనలను తాము తిప్పికొడుతున్నామని, రష్యాపై తమదే పైచేయి అని ఉక్రెయిన్ చెబుతోంది. 


యుద్ధం మొదలైన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు 12,000 మందికిపైగా రష్యా సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. రష్యాకు చెందిన 317 ట్యాంకులు, 49 యుద్ధ విమానాలు, 28 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వార్‌ఫేర్ వ్యవస్థలు, 81 హెలికాప్టర్లు, 1070 ఆర్మర్డ్ వెహికల్స్, 7 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది.

మరిన్ని వార్తల కోసం..

ప్రధాని మోడీకి థాంక్స్ చెప్పిన పాక్ యువతి

రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక దోషికి బెయిల్

రేపు రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రుల భేటీ