ఉక్రెయిన్ పోర్ట్ సిటీలో భీకర దాడులు

ఉక్రెయిన్ పోర్ట్ సిటీలో భీకర దాడులు

పోర్ట్ సిటీలో జరిగిన బీకర దాడుల్లో రష్యాకు చెందిన నాలుగో మేజర్ జనరల్ చనిపోయినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. రష్యాకు చెందిన రెండు SU-34 సహా.. మూడు యుద్ధ విమానాలు, ఓ చాపర్ ను కూల్చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు 14 వేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. 430 యుద్ధ ట్యాంకులు, 1375 సాయుధ వాహనాలు, 84 యుద్ధ విమానాలు, 180 హెలికాప్టర్లు, 11 డ్రోన్లను తమ సైన్యం కూల్చిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. 
మేరియుపొల్  నుంచి మానవతా కారిడార్ ద్వారా 20వేల మంది తరలింపు
దాదాపు 20,000 మంది పౌరులు మేరియుపొల్  నుంచి మానవతా కారిడార్  ద్వారా తరలివెళ్లారు. 12 పట్టణాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. రష్యా నౌకాదళం కూడా పెద్దఎత్తున దాడులు చేస్తోంది. ఖర్కివ్ లో ప్రవేశించాలన్న రష్యా దళాల ప్రయత్నాలను తిప్పికొట్టామని ఉక్రెయిన్  తెలిపింది. చెర్నిహైవ్ లో ఆహారం కోసం వరసలో నిల్చొన్నవారిలో 10 మందిని రష్యా దళాలు పొట్టనపెట్టుకున్నాయి. సైనికాధికారులు సహా మరో 15 మంది రష్యా అధికారులపై ఆంక్షలు విధిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్  ట్రూడో ప్రకటించారు. కెనడా ప్రధానితో పాటు300 మంది అధికారులపై ఆంక్షలు అమలు చేస్తున్నట్లు రష్యా కూడా ప్రకటించింది.
 

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

45 రోజుల్లో ఏడంతస్తుల బిల్డింగ్ కట్టేసిన్రు

పెట్రోల్​ మస్తు కొంటున్రు