టర్కీలో ఉక్రెయిన్ - రష్యా విదేశాంగ మంత్రుల భేటీ

టర్కీలో ఉక్రెయిన్ - రష్యా విదేశాంగ మంత్రుల భేటీ

అంకారా: ఉక్రెయిన్ పై రష్యా కాల్పుల విరమణకు రష్యా అంగీకరించలేదు. ఓ వైపు ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తూనే.. మరో వైపు తటస్థ వేదిక టర్కీలో ఉక్రెయిన్ విదేశాంగ శాఖలో రష్యా విదేశాంగశాఖ చర్చలకు హాజరైంది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్నివిరమించడంతోపాటు ఉక్రెయిన్ తో రష్యా వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు చొరవ తీసుకుంటున్న టర్కీ దౌత్య ప్రయత్నాల ఫలితంగా ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు, వారి ప్రతినిధులతో గురువారం టర్కీలోని అంటల్యా డిప్లమసీ ఫోరం వేదికగా సమావేశమై చర్చించారు. మధ్యవర్తిలా టర్కీ విదేశాంగమంత్రి మెవ్లుట్ కావూసోగ్లు సైతం చర్చల్లో పాల్గొన్నారు.
ఉక్రెయిన్ పై రష్యా కాల్పులు ప్రారంభించి 15 రోజులవుతున్న నేపథ్యంలో టర్కీ వేదికగా ఇవాళ అత్యున్నత స్థాయి సమావేశం జరగడం విశేషం. సమావేశంలో రష్యా యుద్ధ నీతి, నిబంధనలు పట్టించుకోకుండా మహిళలు, గర్భిణీ స్త్రీల ఆస్పత్రిపై కాల్పులు జరిపిందని ఉక్రెయిన్ విదేశాంగ ప్రతినిధులు ఆరోపించారు. సామాన్యులు, విదేశీయులు ఎవరూ బలవ్వకుండా కనీసం 24 గంటలపాటు కాల్పుల విరమణ పాటించాలని ఎంతగా కోరినా రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఎలాంటి హామీ ఇవ్వలేదు.  దీన్ని బట్టి రష్యా దాడుల విషయంలో మరింత మంది నిర్ణయాధికారాలున్న వారు రష్యాలో ఉన్నారని స్పష్టమైందన్నారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి, దౌత్య ప్రయత్నాలకు సిద్ధంగా ఉన్నామని.. అప్పటి వరకు రష్యా  కాల్పులను దీటుగా తిప్పికొడుతూనే ఉంటామన్నారు. మా భూములు, మా హక్కులు, మా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడేదిలేదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా స్పష్టం చేశారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్