హైటెక్స్‌‌‌‌‌‌‌‌లో ఉమంగ్ 2.0 పేరుతో జ్యుయెలరీ, లైఫ్‌‌‌‌‌‌‌‌స్టైల్‌‌‌‌‌‌‌‌ ఎగ్జిబిషన్

హైటెక్స్‌‌‌‌‌‌‌‌లో ఉమంగ్ 2.0 పేరుతో జ్యుయెలరీ, లైఫ్‌‌‌‌‌‌‌‌స్టైల్‌‌‌‌‌‌‌‌ ఎగ్జిబిషన్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్- (జిటో) హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని  హైటెక్స్‌‌‌‌‌‌‌‌లో ఉమంగ్ 2.0 పేరుతో జ్యుయెలరీ, లైఫ్‌‌‌‌‌‌‌‌స్టైల్‌‌‌‌‌‌‌‌ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది.  ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఎక్స్‌‌‌‌‌‌‌‌పోకు ప్రవేశం ఉచితం. ఉమంగ్ 2.0 శనివారం గ్రాండ్‌‌‌‌‌‌‌‌గా ఓపెన్‌‌‌‌‌‌‌‌ అయ్యింది.  కలర్స్ ఆఫ్ ఇండియా నృత్య నాటికను ప్రదర్శించారు.  ఈ ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులు మహారాష్ట్రలోని షోలాపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన 50 మంది ప్రదర్శకులతో కూడిన మిరాజ్‌‌‌‌‌‌‌‌కర్ బ్యాండ్‌‌‌‌‌‌‌‌ డోల్ (డ్రమ్స్) ప్రదర్శనలు ఇచ్చారు.

సందర్శకులను రెట్రో, పాతకాలపు కార్లు అయిన రోల్స్ రాయిస్, జాగ్వార్ , ఆడిల్లో ఎక్కించి ఆశ్చర్యపరిచారు. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌‌‌‌‌‌‌‌పో హైటెక్స్‌‌‌‌‌‌‌‌లోని మూడు హ్యాంగర్‌‌‌‌‌‌‌‌లలో విస్తరించి ఉంది. 500 మంది ఎగ్జిబిటర్లు ఆభరణాలు, జీవనశైలి, ఫర్నిచర్, ఆటోమొబైల్స్, హోమ్ డెకరేషన్ ఉత్పత్తులు, ఇతర వాటిని ప్రదర్శిస్తున్నారు.  దీనిని దాదాపు 75,000 మంది సందర్శించే  అవకాశం ఉంది.