కూరగాయలు అమ్మేవారికి గొడుగుల పంపిణీ

కూరగాయలు అమ్మేవారికి గొడుగుల పంపిణీ

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ లోని ఎస్పీఎం కంపెనీ తరఫున చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేశారు. స్పర్శ ఫౌండేషన్, సిర్పూర్ పేపర్ మిల్లు ఆధ్వర్యంలో పట్టణంలోని సర్ సిల్క్ మార్కెట్, అంబేద్కర్ చౌరస్తాలో కూరగాయలు అమ్మేవారికి, చిరు వ్యాపారులకు గొడుగులు అందించారు.

ఈ సందర్భంగా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మిశ్రా, జనరల్ మేనేజర్ ఎమ్మెస్ గిరి మాట్లాడుతూ.. ఎండ తీవ్రతకు చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గొడుగులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కంపెనీ జీఎం (సివిల్) గిరీష్ రాయ్, సీనియర్ మేనేజర్ రమేశ్ రావు, ప్రతినిధి తుమ్మ రమేశ్, స్పర్శ ఫౌండేషన్ మేనేజర్ రీణా బివాల్, సభ్యులు  తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : కాంగ్రెస్​లోకి ఖానాపూర్ పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లు