కరోనాతో మృతి.. కారుపై పాడె కట్టి శ్మశానానికి..

కరోనాతో మృతి.. కారుపై పాడె కట్టి శ్మశానానికి..

ఆగ్రా: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వైరస్ విజృంభణకు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు కరోనా పేషెంట్ల విషయంలో దహన సంస్కారాల కోసం శ్మశానానికి తీసుకెళ్లడానికి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. కరోనా వల్ల చనిపోయిన ఓ పేషెంట్‌కు శ్మశానానికి తీసుకెళ్లడానికి అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో అతడి కొడుకు తన కారు మీద పాడె కట్టి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన అందరి మనసుల్ని కలచివేసింది. ఆగ్రాలో కరోనా వల్ల చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువ సంఖ్యలో ఉండటం, తక్కువ అంబులెన్స్‌‌లు అందుబాటులో ఉండటంతో సదరు వ్యక్తి తన తండ్రి మృతదేహాన్ని కారుపై తీసుకెళ్లాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఆగ్రాలో కరోనా బారిన పడి చనిపోయిన వారి మృతదేహాలను శ్మశానానికి అంబులెన్స్‌‌ల్లో తరలించడానికి 6 గంటల పాటు వేచి చూడాల్సి వస్తోందని సమాచారం.