గోదావరి రైస్ స్టోర్స్​లో కల్తీ లేని బియ్యం

గోదావరి రైస్ స్టోర్స్​లో కల్తీ లేని బియ్యం

నస్పూర్, వెలుగు: రైతుల నుంచి జై శ్రీరాం వడ్లను సేకరించి ఎక్కువ పాలిష్ లేకుండా ధాన్యాన్ని మిల్లింగ్ చేసి కల్తీ లేకుండా తక్కువ ధరకు బియ్యాన్ని అందిస్తున్న గోదావరి ఎఫ్ పీ ఓ రైస్ స్టోర్స్​ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ బి.రాహుల్ తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన గోదావరి ఎఫ్​పీఓ రైస్ స్టోర్​ను శనివారం ఆయన ప్రారంభించారు. 

ఈసందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని మహిళా సంఘాలతో భీమారం, జైపూర్ మండలాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎక్కువ పాలిష్, కల్తీ లేకుండా మిల్లింగ్ చేసి లాభాపేక్ష లేకుండా క్వింటాల్​కు రూ.5,800 అమ్ముతున్నట్లు తెలిపారు. రవాణా చార్జీలతో విక్రయ కేంద్రం నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడానికి సౌకర్యం కల్పించామన్నారు. 

బియ్యం కావాల్సిన వారు 9652004886, 7337488828 నంబర్లలో సంప్రదించలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, సంబంధిత అధికారులు, విక్రయ కేంద్రం నిర్వహకులు పాల్గొన్నారు.