అనుమతి లేని ఆధార్ కేంద్రం సీజ్

అనుమతి లేని ఆధార్ కేంద్రం సీజ్

వికారాబాద్ జిల్లా తాండూరులో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆధార్ కేంద్రాన్ని సీజ్ చేశారు. తాండూరు తహసీల్దార్ తారాసింగ్ సమక్షంలో కేంద్రంలోని సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

తాండూరు పట్టణంలోని సీసీఐ కాలనీలో సొంత ఇంటిలో జిరాక్స్ సెంటర్ పెట్టాడు. అయితే జిరాక్స్ సెంటర్ నడుపుతూ.. మరోవైపు అనుమతులు లేకుండ ఆధార్ సెంటర్ ను కూడా నిర్వహిస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు తాండూరు తహసీల్దార్ తారాసింగ్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ సైట్ ను అక్రమంగా డౌన్ లోడ్ చేసి.. ఆధార్ తో అక్రమ వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. 

దీంతో బుధవారం(జనవరి 03) తహసీల్దార్ తారాసింగ్ ఆర్ఐ రాజిరెడ్డితో కలిసి కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా కేంద్రం నిర్వహస్తున్నట్లు గుర్తించారు. అనంతరం అందులో ఉన్న కంప్యూటర్, స్కానర్ ప్రింటర్ల తదితర సామాగ్రిని సీజ్ చేసి.. తాసిల్దార్ కార్యాలయానికి తరలించారు. అనుమతులు పొందిన తరువాతే ఆధార్ సెంటర్ నిర్వహించాలని అధికారులు స్పష్టం చేశారు.