నేటి నుంచి అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-19 విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నేటి నుంచి అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-19 విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బెనోని (సౌతాఫ్రికా): యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లకు ప్రాచుర్యం కల్పించే దిశగా ఐసీసీ మరో అడుగు ముందుకేసింది. తొలిసారి అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–19 విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–సిలో జరిగే తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షెఫాలీ వర్మ నేతృత్వంలోని టీమిండియా.. సౌతాఫ్రికాతో తలపడుతుంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గొంగడి సునీతతో పాటు ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిచా ఘోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఈ టోర్నీలో బరిలోకి దిగనుంది.

మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా విభజించారు. బెనోని, ఫోచెస్ట్రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నాలుగు వేదికల్లో 41 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నిర్వహించనున్నారు. ఈ నెల 29న ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరగనుంది. ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జింబాబ్వే, అమెరికా, యూఏఈ, రువాండా, స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇండోనేసియా బరిలో ఉన్నాయి.