ఒకే రోజు నాలుగు పరీక్షలు.. బండి సంజయ్ కు వినతి పత్రం

ఒకే రోజు నాలుగు  పరీక్షలు.. బండి సంజయ్ కు వినతి పత్రం

కరీంనగర్ లో బండి సంజయ్ ను నిరుద్యోగులు కలిశారు. ఏప్రిల్ 30న ఒకే రోజు నాలుగు ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తున్నారని.. వేరు వేరు తేదీల్లో ఈ పరీక్షలను జరిగేలా  చూడాలని వినతీ పత్రం అందజేశారు. కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, అసిస్టెంట్ ఇంజనీరింగ్(ఏఈ), జూనియర్ లైన్ మెన్ (జెఎల్ఎం) పరీక్షలు ఒకేరోజు ప్రభుత్వం నిర్వహిస్తోందని అభ్యర్థులు  ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పరీక్షలు రాయడానికి తగిన విద్యార్హతలున్న తమకు ఒకే రోజు నాలుగు పరీక్షలు పెడితే.. నష్టం జరుగుతుందని నిరుద్యోగులు బండి సంజయ్ కు వివరించారు.  రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. తమ భవిష్యత్తును కాపాడాలని బండి సంజయ్ ను నిరుద్యోగులు కోరారు.

నిరుద్యోగుల వినతిపై బండి సంజయ్ సానుకూలంగా స్పందించారు. నిరుద్యోగులకు నిరంతరం అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వెంటనే ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. అర్హతలకు తగిన విధంగా అన్ని పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని మాటిచ్చారు.