సింగరేణిలో  కొలువుల భర్తీ ఎప్పుడు?..5 నెలలుగా యువత ఎదురుచూపులు

సింగరేణిలో  కొలువుల భర్తీ ఎప్పుడు?..5 నెలలుగా యువత ఎదురుచూపులు
  •     558  పోస్టుల రిక్రూట్​మెంట్​కు జనవరిలో నిర్ణయం
  •     ఫిబ్రవరిలో నోటిఫికేషన్​ విడుదల చేస్తామన్న మేనేజ్​మెంట్​
  •     నాలుగు జిల్లాల నిరుద్యోగులకు 90శాతం ఉద్యోగాలు
  •      ఐదు నెలలుగా కోల్​బెల్ట్​ యువత ఎదురుచూపు


కోల్​బెల్ట్​, వెలుగు:  సింగరేణి సంస్థలో  కొత్త జాబ్​ నోటిఫికేషన్ల కోసం కోల్​బెల్ట్ ఏరియా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.  మెడికల్ ఇన్వాలిడేషన్​తో కార్మిక  కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న  సింగరేణి  సంస్థ ఖాళీ  పోస్టుల రిక్రూట్​మెంట్​ పట్టించుకుంటలేదు.   558 పోస్టులు భర్తీ చేస్తామని మురిపించిన మేనేజ్​మెంట్​ ఐదు నెలలు అవుతున్నా  నోటిఫికేషన్​ ప్రకటించలేదు.

ఫిబ్రవరిలో నోటిఫికేషన్​ ఇస్తామని..

సింగరేణిలో ఖాళీగా ఉన్న 558  పోస్టులను   కొత్తవారితో పాటు ఇంటర్నల్ ​ఎంప్లాయీస్​తో  భర్తీ చేస్తామని జనవరిలో  మేనేజ్​మెంట్​ ప్రకటించింది. ఇందుకు ఫిబ్రవరిలో  నోటిఫికేషన్​  విడుదల చేస్తామని పేర్కొంది.  ఇంజినీరింగ్​, పర్సనల్​, అకౌంట్స్​, మైనింగ్​, వైద్య విభాగాల్లో  కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 558 పోస్టుల్లో 277 కొత్తవారికి, 281 ఖాళీలను సింగరేణి సంస్థలో పనిచేసే ఇంటర్నేషనల్​ ఎంప్లాయీస్​కు చాన్స్​ ఇవ్వనున్నట్లు తెలిపింది. 

నగరాల్లో కోచింగ్​..

ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్​, కరీంనగర్​, ఖమ్మం,  వరంగల్​ పరిధిలో యువతకు ఈ పోస్టుల్లో 90శాతం రిజర్వేషన్  ఉంటుంది. ​ ఎక్కువ శాతం ఇంజినీరింగ్​తో  పాటు ఫైనాన్స్​ అండ్​ అకౌంట్స్​ పూర్తి చేసిన అభ్యర్థులున్నారు. సింగరేణి సంస్థ భారీ మొత్తంలో  నియామకాలు చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో  కోల్​బెల్ట్​ ఏరియా గ్రాడ్యుయేట్లు  హైదరాబాద్, వరంగల్​ వంటి  నగరాల్లో  కోచింగ్​ తీసుకుంటున్నారు.  మరోవైపు వారసత్వ ఉద్యోగాల కింద సింగరేణి కంపెనీలో చేరిన ఉద్యోగులు(ఇంటర్నల్​) ఇంజినీరింగ్​, ఎంబీఏ, పీజీలు చదివిన వారు ఉండడంతో మేనేజ్​మెంట్​ జారీ చేసిన ఇంటర్నల్​ పోస్టులు దక్కించుకోవడానికి  ఆశగా 
ఎదురుచూస్తున్నారు. 

ప్రకటించిన పోస్టులివే..

 ఫిట్టర్​ ట్రైనీ
(కేటగిరి-1)                                  114
మేనేజ్​మెంట్​ ట్రైనీ(మైనింగ్​)    79  
మేనేజ్​మెంట్​ ట్రైనీ(మెకానికల్​)    66  
వెల్డర్​ ట్రైనీ(కేటగిరి-1)        43  
జనరల్​ డ్యూటీ మెడికల్​ ఆఫీసర్లు     30 
 అసిస్టెంట్​ ఇంజనీర్​(ఈ2)        30 
జూనియర్​ ఇంజినీర్​(ఈ1)        20 
జూనియర్​ కెమిస్టు, 
టెక్నికల్​ ఇన్​స్పెక్టర్​         20  
పర్సనల్​  డిపార్ట్​మెంట్​        22  
మేనేజ్​మెంట్​ ట్రైనీ సివిల్​        18 
 సబ్​ ఓవర్​సిస్​ ట్రైనీ(సివిల్​)        16
 వెల్ఫేర్​ ఆఫీసర్లు(ఈ1)        11
 ఇండస్ర్టియల్​ ఇంజినీర్​        10 
జూనియర్​ ఎస్టేట్స్​ ఆఫీసర్స్​        10  
 ఐటీ డిపార్ట్​మెంట్​        7
 శానిటరీ ఇన్​స్పెక్టర్​(కేటగిరి-డి),    5
అసిస్టెంట్ ఇంజినీర్​(ఈ2)        4  
జూనియర్​ ఇంజినీర్​(ఈ1)        4
ప్రోగ్రామర్​ ట్రైనీ(ఈ1)        4
జూనియర్​ ఫారెస్టు ఆఫీసర్​        3  
హైడ్రోజియాలజిస్టు         2

పోస్టుల భర్తీలో  నిర్లక్ష్యం

సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో  మేనేజ్​మెంట్​నిర్లక్ష్యం చేస్తున్నది.  అన్ని విభాగాల్లో ఉద్యోగుల కొరతతో  పనిచేస్తున్న వాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. 558 పోస్టుల ఖాళీల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్​ ఇవ్వాలి.

-కాంపెల్లి సమ్మయ్య, ఐఎన్టీయూసీ లీడర్​