కొలువుల భర్తీపై అయోమయంలో నిరుద్యోగులు

కొలువుల భర్తీపై అయోమయంలో నిరుద్యోగులు
  • ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు ఎస్టీ రిజర్వేషన్ల జీవో అమలయ్యేనా?
  • క్లారిటీ ఇవ్వని ప్రభుత్వం.. ఆందోళనలో అభ్యర్థులు
  • రాబోయే నోటిఫికేషన్లకు కొత్త రోస్టర్​ విధానం
  • ఇప్పటికి 20,192 పోస్టులకు నోటిఫికేషన్లు..  
  • వాటిలో 10% రిజర్వేషన్లు అమలు 
  • చేయాలంటున్న  గిరిజన అభ్యర్థులు

హైదరాబాద్, వెలుగు: గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నిరుద్యోగ అభ్యర్థులను అయోమయంలో పడేసింది. ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లకు పెరిగిన రిజర్వేషన్లను వర్తింపజేస్తారా, లేదా అనే కన్ఫ్యూజన్ వారిని వెంటాడుతున్నది. రిజర్వేషన్ల పెంపు కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నామని, కానీ ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి రిజర్వేషన్ల పెంపు అమల్లోకి వస్తుందని జీవోలో పేర్కొనడం నిరాశకు గురిచేసిందని గిరిజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం అప్లికేషన్లు స్వీకరిస్తున్న పోస్టులకు, ఇప్పటికే విడుదలైన గ్రూప్ -1, ఏఈ, ఏఈఈ, ఎస్సై, కానిస్టేబు ల్ తదితర నోటిఫికేషన్లకు వర్తింపజేయాలని వారు కోరుతున్నారు. అయితే టీఎస్ పీఎస్సీ వర్గాలు మాత్రం పాత నోటిఫికేషన్లకు ఈ జీవో వర్తించదని, ఇక మీదట వచ్చే నోటిఫికేషన్లకే వర్తిస్తుందని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పోస్టులు భర్తీ చేసే నాటికి పాత నోటి ఫికేషన్ల పై న్యాయపరమైన చిక్కులు కూడా తలెత్తవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే కొలుపుల భర్తీ మళ్లీ మొదటికొచ్చే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.

జీవో ముందే వచ్చి ఉంటే..

గిరిజనుల రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన నాలుగేం ఢుగా పెండింగ్లో ఉంది. గతంలోనే జీవో ఇచ్చే అవ కాశమున్నా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చి 9న 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటిం చారు. ఇప్పటికే 20,192 పోస్టుల భర్తీకి నోటిఫికేష న్లు విడుదలయ్యాయి. రిజర్వేషన్ల పెంపు జీవో ముందే విడుదలై ఉంటే ఈ పోస్టుల్లో సుమారు 2 వేల పోస్టులు గిరిజనులకు దక్కేవి. 6 శాతం రిజర్వేషన్ల అమలుతో సుమారు 1,200 పోస్టులకే పరిమితం కావాల్సి వచ్చింది. ఫలితంగా 800 పోస్టులను ఎస్టీ అభ్యర్థులు

నోటిఫికేషన్లన్నీ ఇస్తే 6 వేల పోస్టులు|

రాష్ట్రంలో ఇక నుంచి కొత్త రోస్టర్ అమలు కానుంది. 100 పాయింట్ రోస్టర్లో 8. 25, 33, 58. 75, 83వ పాయింట్లలో ఎస్టీ రిజర్వేషన్ అమలు చేస్తున్నా రు. పెరిగిన కోటా ప్రకారం.. ఓపెన్ కేటగిరీలో ఉన్న మరో నాలుగు పాయింట్లను ఎస్టీ కేటగిరీగా చూపనున్నారు. ఇక మీదట విడుదల కానున్న జాబ్. అడ్మిషన్ నోటిఫికేషన్లలో కొత్త రోస్టర్ ప్రకారమే ఆయా కేటగిరీ లకు పోస్టులు, సీట్లు రిజర్వ్ చేయనున్నారు. దీంతో ఇప్పటికే సిద్ధం చేసిన నోటిఫికేషన్లు, తుది దశలో ఉన్న నోటిఫికేషన్లలో కొత్త రోస్టర్ ప్రకారం మార్పులు చేయాల్సి ఉంది. ఇక మీదట ప్రతి 100 పోస్టుల్లో 10 పోస్టులు గిరిజనులకే దక్కనున్నాయి. ఇప్పటికే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదం తెలిపిన గురుకుల, గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లతోపాటు. ఇంకా ఆమోదం తెలపాల్సినవి కలిపి ఇంకా 59.847 పోస్టులకు నో టిఫికేషన్లు రావాల్సి ఉంది. అన్ని నోటిఫికేషన్లు పస్తే పెరిగిన రిజర్వేషన్ ప్రకారం సుమారు 6 వేల పోస్టులు గిరిజన అభ్యర్థులకు దక్కనున్నాయి. రాష్ట్రంలో కన్వీన ర్ కోటాలో భర్తీ చేయబోయే సుమారు 4 వేల మెడికల్ సీట్లలో 400 సీట్ల వరకు గిరిజన స్టూడెంట్స్ కే రానున్నాయి.

ప్రభుత్వం ప్రకటన చేయాలి. 

గ్రూప్ -1 ఎస్సై, సీడీపీఓ, ఏఈ లాంటిపాత హోదా కలిగిన ఉద్యోగాలన్నీ నోటిఫికేషన్లలోనే ఉన్నాయి. పాత నోటిఫికేషన్లకు సంబంధించిన పోస్టులు ఇంకా భర్తీ చేయనందున.. ఆ నోటిఫికేషన్లకు 10 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలి. జీవోలో మార్పులు చేసి ప్రభుత్వం ప్రకటన చేయాలి.
జాటోత్ హుస్సెన్ నాయక్,
బీజేపీ ఎస్టీ మోర్తా రాష్ట్ర అధ్యక్షుడు

పాత నోటిఫికేషన్లకూవర్తింపజేయాలి 

గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని చాలాఏండ్లుగా కొట్లాడుతున్నాం. రిజర్వేషన్: పెంచుతామని సీఎం కేసీఆర్ కూడా ఎన్నికల. మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాక జీవో || ఇవ్వడంతో సుమారు 800 ఉద్యోగాలు లాస్ అయ్యాం. ఆర్నెల్ల ముందే జీవో ఇచ్చి ఉంటే ఈ నష్టం జరిగేది కాదు. ఆ నోటిఫికేషన్లకు కూడా వర్తింపజేసి గిరిజనులకు న్యాయం చేయాలి.
వెంకటేశ్ చౌహాన్, బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి

పోస్టులు పెరుగుతయా?

పోలీస్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు 17,516 పోస్టులకు ఇప్పటికే ప్రిలిమ్స్​ పరీక్ష నిర్వహించింది. టీఎస్‌‌పీఎస్సీ 2,676 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన పోస్టులన్నింటినీ పాత రోస్టర్ ప్రకారం కేటగిరీల వారీగా కేటాయించారు. ఏఈ, ఏఈఈ, టౌన్ ప్లానింగ్, సీడీపీఓ పోస్టుల భర్తీ కోసం టీఎస్‌‌పీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసి, అప్లికేషన్లు స్వీకరిస్తున్నది. దరఖాస్తు చేసుకునే నాటికే రిజర్వేషన్ పెంపు అమల్లోకి వచ్చినందున.. తమకు కేటాయించిన పోస్టులు పెరుగుతాయా లేదా అనే కన్ఫ్యూజన్‌‌లో గిరిజన అభ్యర్థులు ఉన్నారు. ఏ నోటిఫికేషన్‌‌కు సంబంధించిన పోస్టుల భర్తీ పూర్తి కాని దృష్ట్యా అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన జీవో పాత నోటిఫికేషన్లకు వర్తిస్తుందా? లేదా అనే విషయంలో సర్కార్ నుంచి క్లారిటీ రాలేదు.