నాకొక గర్ల్ ఫ్రెండ్ ను చూసి పెట్టండి.. ఎమ్మెల్యేకు యువకుడి లేఖ

V6 Velugu Posted on Sep 14, 2021

  • గర్ల్ ఫ్రెండ్ దొరకడం లేదని విసిగిపోయి ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్న యువకుడు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యువకుడి లెటర్

చంద్రాపూర్: తనకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా దొరకడం లేదని అసంతృప్తితో రగిలిపోయిన ఓ యువకుడు.. తన కోసం ఒక గర్ల్ ఫ్రెండ్ ను చూసి పెట్టాలని వేడుకుంటూ తన నియోజకవర్గ ఎమ్మెల్యే సుభాష్ ధోటేకి  లేఖ రాశాడు. సాధారణంగా తమకు ఉద్యోగం కావాలనో.. లేక ఏదైనా పని జరిగేటట్లు చూడాలనో లేదంటే తమ ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేలకు మొరపెట్టుకుంటుంటారు. కుదిరితే వినతి పత్రాలను సమర్పిస్తుంటారు. లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అడుగుతుంటారు. అయితే ఒక యువకుడు విచిత్రంగా తనకు ఎలాగైనా ఒక గర్‌ఫ్రెండ్‌ను చూసిపెట్టాలని కోరుతూ ఎమ్మెల్యేకు లేఖ రాశాడు. మహారాష్ట్రలోని చంద్రపూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే సుభాష్‌ థోతెకు సదరు యువకుడు రాసిన ఉత్తరం సోషల్‌మీడియాలో వైరల్‌గా అవుతోంది. 
భూషణ్‌ జామువంత్‌ అనే యువకుడు తనకు గర్ల్ ఫ్రెండ్‌ కావాలని కోరుతూ తన మాతృభాష మరాఠీలో లేఖ పంపాడు. తన ప్రాంతంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నా.. నన్ను ఎవరూ ఇష్టపడటం లేదని భూషణ్ జామువంత్ వాపోయాడు. గర్ల్ ఫ్రెండ్ ను దొరికిచ్చుకునేందుకు రాజురా నుంచి గాడ్ చందూర్ వరకు మొత్తం తిరిగాను, అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ దొరకుతున్నారు.. నాకు మాత్రం ఎవరూ దొరకకపోవడంతో ఆందోళన పెరిగిపోతోంది, నిరాశకు గురవుతూ ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నానని లేఖలో పేర్కొన్నాడు. తనకంటే తక్కువ స్థాయిలో మరీ ముఖ్యంగా తాగుబోతులు, జులాయిగా తిరిగేవారికి కూడా గర్ల్‌ ఫ్రెండ్స్‌ దొరకుతున్నారు.. ఇలాంటి వారిని చూసినపుడు.. నాకెందుకు దొరకడం లేదని బాధ కలుగుతోందని వాపోయాడు. 
యువకుడు తనకు రాసిన లేఖపై ఎమ్మెల్యే సుభాష్‌ థోతె స్పందించారు. ఇలాంటి లేఖ రావడం ఇదే తనకు మొదటిసారి అని, గతంలో ఎప్పుడూ ఇటువంటి లేఖలు రాలేదని తెలిపారు. లేఖ రాసిన భూషణ్‌ జామువంత్‌ మానసిక పరిస్థితి అర్థమవుతోందని, అతను ఎక్కడ ఉంటాడనేది తెలియడం లేదన్నారు. లేఖ రాసిన యువకుడి ఆచూకీ తెలుసుకోవాల్సిందిదిగా కార్యకర్తలను కోరానని తెలిపారు. భూషణ్ జమూవంత్ ఆచూకీ తెలిస్తే కౌన్సెలింగ్‌ ఇప్పించి జీవితంలో స్థిరపడేలా చేయూతనిస్తానని, అయితే ఇలాంటి లేఖలు ఎమ్మెల్యేలకు రాయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. 

 


 

Tagged maharastra, chandrapur, , MLA Subhash Dhote, Chandrapur MLA, Congress party MLA, Bhushan Jamuwant, Bhushan jamuwant wrote letter to MLA, Bhushan jamuwant asking girlfriend

Latest Videos

Subscribe Now

More News